చందుర్తి: ఆదివాసీ యోధుడు జల్ – జంగల్ – జమీన్ అనే నినాదంతో ఆదివాసీల భూ హక్కుల కై, నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన గోండు బిడ్డ కొమురం భీమ్ 120 వ జయంతి చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఆదివాసులు, గోండు, గిరిజనులకు భూముల కోసం, స్వేచ్ఛ కోసం ఉద్యమించిన కొమురం భీం చరిత్రను మనమం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విక్కుర్తి లక్ష్మీనారాయణ గౌడ్, ఉపాధ్యాయులు రొండి చంద్రకళ, సుజాత, ప్రతిభ, స్వప్న, సాహితీ, తదితరులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గోన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.