ఆనాధ నలుగురు ఆడపిల్లలకు చేయూత అందించిన చార్లెట్ హోమ్ అనాధ ఆశ్రమం

ఆనాధ నలుగురు ఆడపిల్లలకు చేయూత అందించిన చార్లెట్ హోమ్ అనాధ ఆశ్రమం (ఎన్ ఎన్ హెచ్ ఆర్ ఎఫ్ ) అధ్యక్షులు జాటోత్ డేవిడ్ రాజు

నేషనల్ నింబిల్ హ్యుమన్ రైట్స్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజెన్ చీఫ్ డా దుర్గం ప్రభాకర్

ఆత్మకూరు (యస్ ) మండల కేంద్రంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధగా మిగిలిన నలుగురు ఆడపిల్లలను నేషనల్ నింబిల్ హ్యుమన్ రైట్స్ పౌండేషన్ (NNHRR) సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జాటోత్ డేవిడ్ రాజ్ ఈ రోజు పేపర్లో ఆడబిడ్డలు… ఆనాధలు కథనం వచ్చిన న్యూస్ చదివి చలించి దయా హృదయంతో చాక్లెట్ హోం ఆనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు (ఎన్ ఎన్ హెచ్ ఆర్ ఎఫ్)సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జాటోత్ డేవిడ్ రాజు రైస్ బాగ్స్, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు మరియు నలుగురు ఆడ పిల్లలకు నూతన వస్త్రములు బహూకరించారు ఈ సందర్భంగా డేవిడ్ రాజు మాట్లాడుతూ నలుగురు పిల్లలను చదివిస్తానని వారి భవిష్యత్ బంగారుబాట కు ముందుండి సహకరిస్తానని వారు ఎప్పుడూ ఆశ్రమంలోకి వచ్చిన చేర్చుకొని సహకరిస్తానని వారిని చదివిస్తనని చెప్పారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర (ఎన్ ఎన్ హెచ్ ఆర్ ఎఫ్) సీనియర్ సిటిజన్ చీప్ డా దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ ముల్కలపల్లి వీరయ్య కొటమ్మ మృతి పట్ల విచారం వ్యక్తపరిచారు యుక్త వయస్సులో వారి కుమార్తెలు పెద్ద కుమార్తె వెన్నెల (21) రెండో కుమార్తె మేఘన (19) మూడో కుమార్తె ప్రమిద (16) నాలుగో కుమార్తె హరిని (10) సంవత్సరాలు తల్లి తండ్రులను కోల్పోవడం చాలా వేదన గురైనారని సొంత ఇల్లు స్థలం లేక తీవ్ర ఇబ్బందులకు గురి కావడం చాలా బాధాకరం అని వారిని చదివించడానికి చార్లెట్ హోం అనాధాశ్రమం వారు ముందుకు రావడాన్ని అభినందించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లలకు దళిత బంధు, మరియు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసి వారిని ఆదుకోవాలని పత్రిక మూలంగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు (యస్ ) మండల పాస్టర్స్ అధ్యక్షులు యడవెల్లి అబ్రహం, పాస్టర్ పి వి బోయజు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.