ఆన్ లైన్ మోసాల పట్ల యువత జాగ్రత్తగా ఉండాలి

ప్రస్తుతం కొందరు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారని, వారి పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని తల్లాడ ఎస్సై సురేష్ సూచించారు. సోమవారం తల్లాడలో ఆయన యువకులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలను అతివేగంగా నడపవద్దని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గంజాయి, గుట్కా, పాన్ పరాకులపై ఉక్కు పాదం మోపుతామన్నారు. అదేవిధంగా సెల్ ఫోన్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, ఎవరు తమ ఓటీపీ నెంబరు ఇతరులకు చెప్పవద్దని సూచించారు. ఆన్లైన్ మోసాలు అధికంగా జరుగుతున్నందున యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయలు, కానిస్టేబుల్ బాలాజీ, నాగేశ్వరరావు, రంజిత్, తదితరులు ఉన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.