ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కై డాక్టర్లు వైద్య రంగంలో దైవ సమానులుగా విశిష్ట సేవలు అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. శుక్రవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ డాక్టర్స్ డే శుభాకాంక్షలు, గౌరవ ప్రధమైన వైద్య వృత్తిలో ఉంటూ రోగులకు. సమాజానికి విశిష్ట సేవలు అందిస్తూ ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం లో వారి పాత్ర గొప్పదని కలెక్టర్ అన్నారు. తమ వృత్తి రీత్యా ప్రేమానురాగాలతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అంకిత భావంతో సమయపాలన పాటించాలన్నారు.
ప్రజలందరికీ మరో జన్మ ను, విలువైన ప్రాణాలను నిలబెడుతూ ప్రజల ఆరోగ్యాలను ఎల్లప్పుడు కాపాడేందుకు అనునిత్యం శ్రమించే మీరే సమాజంలో అసలైన హీరోలని, అవసరమైన ఉన్నతమైన సేవలను సకాలంలో స్పందించి ప్రాణాలు నిలబెట్టడంలో మీకు సాటి లేరని, కరోన వంటి తీవ్రమైన మహమ్మారి నుండి రోగుల ప్రాణాలను కాపాడుటలో మీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వృత్తిరీత్యా బాధ్యతాయుతంగా పనిచేస్తూ కరోనా కట్టడి లో వైద్యుల పాత్ర గొప్పదని కలెక్టర్ అన్నారు. అనంతరం వారి విశిష్ట సేవలకు. మహబూబాద్ జిల్లా అర్బన్ పార్క్ లో డాక్టర్స్ డే సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం లో ఉగ్గంపల్లి వైద్యాధికారి డాక్టర్ రవి ని జిల్లా కలెక్టర్ కె శశాంక జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ హరిష్ రాజులు కలిసి వారికి శాలువాతో సన్మానించారు అదేవిధంగా ఉగ్గంపల్లి ఆరోగ్య కేంద్రం సిబ్బంది కలిసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పురుషోత్తం , రాధా కుమారి, మాధవి, ఏఎన్ఎం శ్యామల, నర్సా బాయ్ , వనిత, భారతి, శ్రావణి ,వీరయ్య ,అనిల్ జ్యోతి, సైదమ్మ ,కళావతి ,ఉపేంద్ర కల్పన ,సంధ్య ,పుష్ప నిర్మల,తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.