ఆశా లను గుర్తించింది దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే

👉 ప్రజారోగ్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్

👉 ఆశా కార్యకర్తలకు స్మార్త ఫోన్ ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు

కరోనా నియంత్రణలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్​‍గా పనిచేసిన ఆశా వర్కర్‌ల సేవలు మరువలేనివని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. కరోనా పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు, తదితర సమాచారాన్ని పొందుపరుచడానికి ఆశా వర్కర్‌లకు స్మార్ట్ ఫోన్‌లను ఇవ్వడం అనేది వైద్య రంగం లో మంచి పరిణామం అన్నారు. కోదాడ నియోజకవర్గం లో 270 మంది కి ఎమ్మెల్యే స్మార్ట్ ఫోన్ లు అందజేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందజేయాలనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మరోవైపు ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచింది దేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే నని అన్నారు.. తెలంగాణలో ప్రతి నెలా మొదటి వారంలోనే ఆశావర్కర్లలకు వేతనం అందిస్తున్నామని తెలిపారు. ఆశా కార్యకర్తల పనితీరును ప్రభుత్వం గుర్తించడం వల్లే వారికి స్మార్ట్ ఫోన్స్, సిమ్ కార్డులను పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ వెల్లడించారు.కరోనా కాలంలో ఆశా కార్యకర్తలు బాగా పనిచేశారని ఎమ్మెల్యే కొనియాడారు. ఆశా కార్యకర్తలు ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలందించాలని ఆకాంక్షించారు. కష్టపడితే కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలు పెంచడం ద్వారా మరోసారి తన మాటలను రుజువు చేశారన్నారు.
ప్రజారోగ్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నామన్నారు. తెలంగాణ లో రాష్టాన్ని వైద్య రంగం లో దేశంలో నే నంబర్ వన్ స స్థానంలో నిలబెట్టేందుకు అందరం కృషి చేద్దామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవిత రెడ్డి, డిఎంఅండ్హెచ్ఓ కోట చలం డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ నిరంజన్, హర్షవర్ధన్, ప్రోగ్రామ్ ఆఫీసర్ కళ్యాణ్ చక్రవర్తి, మెడికల్ ఎంప్లాయిస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాకుల మధుబాబు రాష్ట్ర కార్యదర్శి ఎం సుదర్శన్ జిల్లా అధ్యక్షులు లు భూతరాజు సైదులు వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.