సెస్ ల పేరుతో ఆర్టీసీ బస్సులలో పల్లె వెలుగు, సిటీ సర్వీస్ లో రెండు రూపాయలు, ఇతర సర్వీసులలో 5 రూపాయల చొప్పున సెస్ ల పేరుతో వసూలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏపూరి సుధీర్ కుమార్ శనివారం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ
తెలంగాణా వస్తె ఎట్టి పరిస్థితుల్లోనూ బస్ చార్జీలను పెంచమని అనేక సందర్భాల్లో వేదికల మీద చెప్పిన కేసిఆర్ గత సంత్సరం ఒకసారి పెంచి , గత నెలలో ఒక కిలోమీటర్ కి 50 పైసల నుండి 10 రూపాయల వరకు పెంచి, నిన్న సెస్ ల పేరుతో 2 రూపాయల నుండి 5 రూపాయలు వసూలు చేయాలని ప్రభుత్వం దొడ్డిదారిన నిర్ణయాలు చేస్తుందని తెలిపారు. పేద, మద్య తరగతి ప్రజల మీద మోయలేని భారం మోపుతున్నారని ఎద్దేవా చేశారు, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచటం వలన ఇప్పటికే సామాన్యుడు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే ధనిక రాష్ట్రం అంటూ చెప్పుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై మరింత భారం వేయుటకు సెస్ ల రూపంలో ప్రజలపై మరింత భారం వేయుటకు ప్రయత్నిస్తుందని, ఇలాంటి ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు.
