ఆర్థిక ,రాజకీయ సాంఘిక, విషయాల్లో మార్పులు తెచ్చిన సామాజిక విప్లవకారుడు-బాబాసాహెబ్

భారతదేశంలో అనాదిగా వేళ్ళూనుకున్న మనువాద భావజాల సిద్ధాంతానికి భిన్నంగా ఆర్థిక , రాజకీయ ,సాంఘిక విషయాలలో అనేక మార్పులు తెచ్చిన సామాజిక విప్లవకారుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని KVPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో దొడ్డికొమరయ్య భవన్లో 130 వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.

  ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ అంబేద్కర్ సామాజిక విద్యా స్తాపనకోసం కృషి చేశారనీ చదువుకుంటె బతకగలం భవిష్యత్తును జయించగలమని అనాధే చెప్పారనీ అన్నారు.తను చిన్ననాటి నుండి అనేక రకాలుగా కుల వివక్షను ఎదుర్కొన్నారని , ఎన్నిఆటంకాలొచ్చినా వెనుకడుగు వేయకుండా నిమ్న జాతుల కోసం తన కుటుంబాన్ని , తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అని అన్నారు.ప్రతి మనిషి ఆత్మగౌరవంతో నిలబడాలని దాని కోసం ప్రజలను సమీకరించు, బోధించు ,పోరాడు పోరాట మార్గమే శరణ్యం అని తెలిపారనీ అన్నారు.నేడు దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వాలు అంబేడ్కర్ ఆశయాలను,రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కుట్రలను అరికట్టాలని అన్నారు.3 వేల సంవత్సరాల నాటి  మను ధర్మాన్ని మనిషిని మనిషిగా చూడలేని అశాస్త్రీయమైన విధానాలను మళ్లీ ముందుకు తీసుకువస్తుందని అన్నారు. ఇటీవల కాలంలో దళితులు గిరిజనులు మైనారిటీలు మహిళలపై జరుగుతున్న వరుస దాడుల ను చూస్తుంటే సమాజం ఎటుపోతోందోనని అన్నారు.అగౌరవ పరిచే పదజాలాన్ని వాడుతూ నిమ్నకులాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పాలకులు అంబేడ్కర్ విగ్రహాలను పెట్టి దండలేడయం కాదని నిజమైన అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవడం అంటే భిన్న కులాలు భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న జాతులు ఉన్నా ఈ దేశంలో ప్రతి ఒక్కరినీ గౌరవించాలని అన్నారు.
  కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ ముప్పై వరకు పూలే అంబేడ్కర్ సందేశ్ యాత్రలు నిర్వహించి ప్రజలను చైతన్య పరుస్తామని అన్నారు.
   ఈ కార్యక్రమంలో  నాయకులు ఎండీ సలీమ్ పాలడుగు ప్రభావతి చినపాక లక్ష్మీనారాయణ పుచ్చకాయల నర్సిరెడ్డి దండెంపల్లి సత్తయ్య కొండ వెంకన్న నలపరాజు సైదులు భూతం అరుణ కుమారి బ్రహ్మచారి అద్దంకి నరసిమ్మా అశోక్ కోట్ల అశోక్రెడ్డి సతీష్ మౌనిక రఘువరన్ నాగరాజు నరసింహా ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

దొడ్డి కొమరయ్య భవనం నల్లగొండ

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.