ఆర్మీ పరీక్షను యధావిధిగా నిర్వహించాలి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘అగ్నిపధ్’ పథకాన్ని సిపిఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. దీనివల్ల దేశ జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి దివి: 17-06-2022 శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయం ద్వారా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల జేస్తూ ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అగ్నిపత్ రద్దు చేయాలని ఆర్మీ అభ్యర్థులు నిరసన తెలుపుతే వారిపైన పోలీసులు అడ్డుకొని లాఠీచార్జి, కాల్పులు జరపడం చేయడం దుర్మార్గం, బాధాకరమని దీనిని ఖండిస్తున్నామని అన్నారు. నాలుగేళ్ల కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను రిక్రూట్‌ చేయడం వల్ల వృత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదని పేర్కొంది. పెన్షన్‌ డబ్బును ఆదా చేసుకోవడం కోసం ఈ పథకం తేవడమంటే మన వృత్తిపరమైన సాయుధ దళాల నైపుణ్యం, సామర్ధ్యంపై తీవ్రంగా రాజీపడడమేనని విమర్శించారు.

గత రెండేళ్లుగా భారత సైన్యంలో ఎలాంటి రిక్రూట్‌మెంట్‌ లేదు. సాయుధ బలగాల్లోకి రెగ్యులర్‌ సైనికులను రిక్రూట్‌ చేసుకోవడానికి బదులు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల కాంట్రాక్టు సైనికులు తమ నాలుగేళ్ల సర్వీస్‌ తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా మిగిలిపోతారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు తావిస్తుందన్నారు. వారు ప్రైవేట్‌ మిలీషియాగా పనిచేసే పరిస్థితివైపు నెట్టబడతారు. ఇప్పటికే తీవ్రమైన ఒడుదుడుకులకు గురవుతున్న మన సామాజిక వ్యవస్థపై దీని పర్యవసానాలు మరింత ప్రమాదకరంగా ఉంటాయి.

ఉపాధి భద్రతకు కనీస రక్షణ కూడా లేకుండానే అత్యున్నత త్యాగాలు చేయడానికి సిద్ధపడాలంటూ మన యువతకు పిలుపునివ్వడం నేరపూరితమైన చర్య అని వ్యాఖ్యానించారు. ఈ పథకం గురించి ప్రభుత్వం ప్రకటించిన మరు క్షణమే దేశంలోని వివిధ ప్రాంతాల్లో అప్పటికప్పుడు పెద్దయెత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగాయంటే ఈ పథకం పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతున్నది. ఈ రీత్యా అగ్నిపథ్‌ పథకాన్ని తక్షణమే రద్దు చేసి, సాయుధ బలగాల్లోకి రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.