వృద్ధుల అందరికీ పెన్షన్లు నెల నెల ఇవ్వాలని ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా–
సిపిఎం ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ముందు వృద్ధుల అందరికీ పెన్షన్ ఇవ్వాలని ధర్నా చేసి అనంతరం మున్సిపల్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది
అనంతరం సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కూతడి ఎల్లయ్య లు మాట్లాడుతూ వృద్ధుల అందరికీ ఏప్రిల్ నెల పెన్షన్ జూన్ నెల ఒకటో తారీకు వేయడం జరిగిందని మే నెల నుంచి పెన్షన్ రావడం లేదని వృద్ధులు అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని. అన్నారు కేసీఆర్ ను పెద్ద కొడుకుగా భావించిన వృద్ధులు అందరూ ఇప్పటికీ పెన్షన్ రాకపోవటం సిగ్గుచేటని అన్నారు ప్రధానంగా వృద్ధాప్య పెన్షన్ తోనే బీపీ షుగరు ఆరోగ్యం సంబంధించిన మందులు తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయని మరియు ఇతర ఖర్చులకు ఉపయోగపడతాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా పెన్షను నేడు 26 వ తారీఖు వచ్చినప్పటికీ ఇంకా రాలేదని ఆందోళన చెందుతున్నారని అన్నారు వికలాంగులకు వితంతువులకు బీడీ కార్మికులకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ప్రతి నెల ఐదో తారీకు లోపల పెన్షన్ అందేటట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని చెప్పి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్కరికి ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు వెంటనే కొత్త వాళ్లకు కూడా పెన్షన్ ఇవ్వాలని అని డిమాండ్ చేశారు లేనియెడల అందర్నీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఆర్మీ ఏరియా కమిటీ సభ్యులు తోటి భూమన్న B రవి బొట్ల రాజు, సిపిఎం నాయకులు రాజు, రాజన్న, జోహార్ సింగ్, సాయి బాయి, గంగారాం తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.