ఈ నెల 17 న రవి మహల్ లో ప్రమాణ స్వీకారం

ముఖ్య అతిధులుగా పాల్గొన్న నున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ

నూతన కమిటీ తో కలిసి కరపత్రం ఆవిష్కరించిన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మాశెట్టి అనంత రాములు,ప్రధానకార్యదర్శి బండారు రాజా

ఈనెల 17 న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయిబాబా దేవాలయ ప్రక్కనగల రవి ఫంక్షన్ హాల్లో జరుగు సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష కార్యదర్శులు మా శెట్టి అనంతరాములు బండారు రాజాలు తెలిపారు.బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈనెల 17న జరుగు సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వాన కరపత్రాన్ని నూతన కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఆర్యవైశ్యుల ఐక్యతను చాటుటకు సూర్యాపేట జిల్లా లోని ఆర్యవైశ్యులందరూఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆర్యవైశ్యుల సత్తాను చాటగలరు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ తోపాటు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, పార్లమెంటు సభ్యులు ఉత్తంకుమార్ రెడ్డి, శాసనసభ్యులు గాదారి కిషోర్ కుమార్, హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ,కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తో పాటు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ లు విచ్చేయనున్నట్లు తెలిపారు. కావున ఆర్యవైశ్యులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పొలిటికల్ చైర్మన్ తాటికొండ సీతయ్య యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మీలా వంశీ ప్రధాన కార్యదర్శి జిగిని ప్రసాదు కోశాధికారి కొత్తూరు గణేష్, గుండా రమేష్ బాబు మహిళా విభాగం అధ్యక్షురాలు గుండా శ్రీదేవి ప్రధాన కార్యదర్శి మీలా వీరమణి నాయకులు కర్నాటి కిషన్, బొమ్మిడి లక్ష్మినారాయణ, మీలా వాసు దేవ్, మంచాల రంగయ్య కలకోట లక్ష్మయ్య, బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్ నరేంద్రని విద్యాసాగర్ రావు తప్సి గాంధీ, ఈగ దయాకర్ వెంపటిసురేష్, పబ్బాప్రకాష్ గోపారపు రాజు మిరియాల సుధాకర్, గుండా శ్రీధర్ బొమ్మిడి అశోకు, బిక్కుమల్ల కృష్ణ,కొత్త మల్లి ఖార్జున్, గుడుగుంట్ల విద్యాసాగర్ కొల్లూరు బాలకృష్ణ, చల్లా వెంకటేశ్వర్లు, కర్ణాటి కృష్ణ, దేవరశేట్టి సత్యనారాయణ గుండా మురళి, ముప్పారపు నాగేశ్వరరావు, ప్రణీత్, చందా రాజశేఖర్, కొండ శ్రీనివాసు బచ్చు పురుషోత్తం,యామా సంతోష్, యామా రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.