ఆర్.ఎస్.ఎస్ -బిజెపి యొక్క హిందూత్వ నయా ఫాసిజానికి వ్యతిరేకంగా అన్ని వామపక్ష శక్తులు బలమైన ఫ్రంట్‌గా  మారాలి

ఎల్బీనగర్ లోని మన్సూరాబాద్ మారుతీ రెసిడెన్సీ లో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె ఎన్ రామ చంద్రన్ మాట్లాడుతూ ….

భారతదేశంలో అతిపెద్ద వామపక్ష పార్టీగా పేరొందిన సీపీఐ(ఎం) 23వ పార్టీ కాంగ్రెస్ కేరళలోని కన్నూర్ నగరంలో  ప్రస్తుతం జరుగుతున్నా యి.
అందులో సమర్పించిన ముసాయి దా,రాజకీయ తీర్మానం, “ఆర్-ఎస్ ఎస్. మోడీ ఫాసిస్ట్ పాలన సాగు తోంది”   అని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. అందువల్ల  వారి యొక్క రాజకీయ ముసాయిదా పత్రంలో కమ్యూనిస్టుల ఐక్యత గురించి లేదా ఫాసిస్ట్ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు గురించి ఏమీ ప్రస్తావన చేయలేదు.
సీపీఐ(ఎం) వంటి పార్టీల అవకాశ వాద విధానాల వల్ల ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి కూడా ఎన్నికల్లో గెలిచే అవకాశం వచ్చింది.
ఈరోజు మన దేశంలో ఏ పార్టీ అయినా కమ్యూనిస్టు పార్టీ అని చెప్పు కుంటున్నప్పుడు మనువాద /కాషాయ /హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా కనీస ప్రాతిపదికను నిలపడమే ప్రథమ కర్తవ్యం. కానీ పెరుగుతున్న RSS/BJP నయా ఫాసిజానికి వ్యతిరేకం గా పోరాటం మరింత ఉధృతం కావాలసి ఉన్నది. దీనికి  మద్దతును సమీకరించ కుండా ప్రజల డిమాండ్ల ను ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదు.
  ఈ ప్రతిపాదనను సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ రాబోయే సెప్టెంబర్ కేరళ లో జరిగే తమ 12 వ జాతీయ కాంగ్రెస్ లో  ప్రధాన మైనటువంటి అంశంగా ఉంటుందని తెలియ జేశారు.

ఈ ప్రతిపాదన విషయమై సీపీఐ (ఎంఎల్) రెడ్ స్టార్ 12వ జాతీయ మహాసభలను కేరళలో నిర్వహించా లని నిర్ణయించామని, అదేవిధంగా_ ఇటీవల గుంటూరులో జరిగిన, నాలుగు రోజులపాటు కేంద్ర కమిటీ, రెండు రోజులపాటు  పొలిట్‌బ్యూరో సమావేశంలో విప్లవ శక్తుల సమీకర ణపై  ప్రధానంగా చర్చించామని అన్నారు.
అలాగే దాని కోసం హైదరాబాద్‌కు వచ్చి తమ ముఖ్య కార్యకర్తలతో మరియు ఇతర భావసారూప్యత కలిగిన  వామపక్ష కమ్యూనిస్టు విప్లవ సంస్థలతో చర్చించామని తెలిపారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులతో మాట్లాడుతూ-….
ఫాసిస్టు వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి ప్రజాసమస్యలను తమతో కలుపుకుని ముందుకు సాగడమే ఈరోజు కమ్యూనిస్టుల ముందున్న అతి ముఖ్యమైన కర్తవ్యమని రెడ్ స్టార్ తన 12వ పార్టీ కాంగ్రెస్‌లోనే పార్టీ రాజకీయ ముసాయిదా పత్రం లో ప్రకటించిందని చెప్పారు.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో రెడ్‌స్టార్‌ ఆధ్వర్యంలో వామపక్ష శక్తులు ప్రజాప్రతినిధుల ముందు నిలబెట్టిన కొత్త ఇమేజ్‌ ఉత్తర ప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రచారాన్ని రూపొందించడం మంచి ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు.

అఖిల భారత స్థాయిలో బలమైన కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసేందుకు వామపక్ష విప్లవ శక్తుల న్నీ ఏకం కావాలని, అదే సమయం లో కమ్యూనిస్టు పార్టీ చొరవతో భారీ ఫాసిస్టు వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని కా. కెఎన్ రామచంద్రన్ పిలుపునిచ్చారు.
ఈ విలేకరుల సమావేశంలో
పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ సౌర యాదవ్, సిటీ కార్యదర్శి ఆర్. సంతోష్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.సదానందం తదితరు లు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.