బీసీ గురుకులాలకు పెట్టిన మహాత్మ జ్యోతిరావు పూలే పేరును తొలగించాలని ఆర్. కృష్ణయ్య చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు దేశగాని కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణ మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య తెలుగు రాష్ట్రాలలో ఉన్న బీసీ గురుకుల పాఠశాలలకు ప్రస్తుతం ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే పేరును తీసేసి గురుకుల పాఠశాల పేర్లు పెట్టాలి అని అనడం సిగ్గుచేటు కేవలం బీసీ గురుకుల పాఠశాలగా వెనుకబడిన తరగతుల కోసం మహాత్మా జ్యోతిబాపూలే చేసిన కృషి బిసి సమాజం ఎప్పటికీ మరువలేనిది. బీసీల కోసం బీసీల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి మహాత్మ జ్యోతిబాపూలే. బీసీల పేరు చెప్పుకొని పబ్బం గడుపుతున్న ఆర్ కృష్ణయ్య బీసీ వాదం పై వేల కోట్ల రూపాయలు దండుకుంటూ బీసీ సంఘాల పేర్లతో బీసీ భవనాన్ని ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలు వెనకేసుకునిఅగ్రవర్ణాల చేతిలో కి పోయి ఒక రాజ్యసభ సీటు ఇవ్వగానే బీసీలను కించపరుస్తావ వెంటనే బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.