ఆలోచన, పరిణితితో ఓటేయండి-KCR

ఎలక్షన్‌ రాంగనే ఆగం కావొద్దని ఆలోచన, పరిణితితో ఓటు వేయాలని నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ప్రజలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. సభకు విచ్చేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, అశేషంగా హాజరైన నాగార్జునసాగర్‌ ప్రజలందరికి సీఎం నమస్కారం తెలిపారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఈ రోజు ఈ సభ జరగకూడదని, మీరు నేను కలవకూడదని చేయని ప్రయత్నం లేదు. ప్రజాస్వామ్యంలో పూర్తిస్థాయిలో తలాతోక లేని వ్యవహారం ఇది. ఎవరైనా సభలు పెట్టుకుని ప్రజల్లోకి పోయి మంచి చెడ్డలు చెప్పి మమ్మల్ని సమర్థించమని అడుగుతరు. ఇది దేశ రాజకీయాల్లో ఉంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికలో ప్రధానితో సహా అందరూ విశేషంగా ప్రచారం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభ జరగనీయొద్దని చాలా చాలా ప్రయత్నాలు చేశారన్నారు.

గతంలో హాలియా సభకు విచ్చేసినప్పుడు కూడా నేనే ఒకటే చెప్పినా. నేను చెప్పిందే

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.