మున్సిపల్ కార్మికుల సమస్యల పైన డిసెంబర్ 16 17 తేదీల్లో దీక్షలు వంటావార్పు….
పెంచిన వేతనాలు వెంటనే ఇవ్వాలి..
ఈరోజు స్థానిక సుందరయ్య భవన్లో మున్సిపల్ కార్మికుల జిల్లా కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి citu జిల్లా కార్యదర్శి కే రాజయ్య హాజరై మాట్లాడారు, ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పైన డిసెంబర్ 16 ,17 తేదీల్లో కలెక్టరేట్ వద్ద దీక్షలు వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనిని అందరూ జయప్రదం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం ప్రకటించిన వేతనాల పెంపు తక్షణమే Go విడుదల చేసి వాటిని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వేతనాలు పెంచిన ట్లుగా ప్రకటించి కూడా ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను మోసం చేస్తోందని ఆయన అన్నారు, మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు, ఇ ఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని అన్నారు, మున్సిపల్ కార్మికుల సమస్యల పైన రాబోయే కాలంలో పోరాతాలు ఉధృతం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జయరామ్, కార్యదర్శి కసిని రాజు, నాయకులు రాజేష్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.