ఆశా వర్కర్ పనిభారం పెరిగి, అధికారుల వేధింపులతో పనిప్రదేశంలో నే చనిపోయింది

హైదరబాద్ జిల్లా శాలివాహన పియెచ్ సి లో ఆశ వర్కర్ గా పని చేస్తున్న ఆశా వర్కర్ సుజాత పనిభారం పెరిగి, అధికారుల వేధింపులతో పనిప్రదేశంలో చనిపోయిందని ఈ కుటుంబానిని కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేశియ చెల్లించాలని, ఆమె పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని, అమె చావుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఐటియూ జిల్లా కార్యదర్శి రాజయ్య, ఆశా వర్కర్ జిల్లా అధ్యక్షురాలు పి. వరలక్ష్మీ అన్నారు. ఈరోజు ఈ విషయమై స్థానిక కొత్త బస్టాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేయడం సరికాదని ఆమె అన్నారు. ఇకనైనా ఆశవర్క్ లపై పనిభారం తగ్గించి అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటియూ నాయకులు సాయిలు, యాదగిరి, కృష్ణ, పుండ్లిక్, ఆశ వర్కర్లు అరుణ, భారతి, సబితా, శాయిని తది తరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.