ఈరోజు మరిపెడ బంగ్లా లో జరిగిన ప్రెస్ మీటింగ్ లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద కుంభమేళా జాతరగా పేరొందిన సమ్మక్క-సారక్క జాతర మన తెలంగాణలో ఉండడం అనేది మన తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూనాము అని అన్నారు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాక పోవడమే కాకుండా మన తెలంగాణ గవర్నర్ తమిళసై గారు సమ్మక్క సారక్క జాతర కు వెళ్ళినా కూడా తనకు ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా ఉండడంతో పాటు ఆ పరిధిలో ఉన్న ఎస్పీ గారు కలెక్టర్ గారు ఎలాంటి స్వాగతం కూడా పలకకుండా ఉండటం అనేది చాలా బాధాకరమని అన్నారు ఎందుకు ఇలా జరిగింది అంటే గవర్నర్ గారు ఒక బహుజన మహిళా కావడంతో కెసిఆర్ గారు ఇలా చేస్తున్నారని ఆరోపించారు బహుజనులు అంటే కెసిఆర్ కి జెండాలు మోయడం కోసమే పనికి వస్తారా అని కూడా నిలదీశారు, తక్షణమే ఆ రోజు డ్యూటీ లో ఉన్న ఎస్పీ గారిని కలెక్టర్ గారిని సస్పెండ్ చేయాలని కోరారు,కెసిఆర్ గారు ఇలానే ప్రవర్తిస్తే కచ్చితంగా రానున్న రోజుల్లో ఓటుతో సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కూడా అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన కార్యదర్శి గుండ గాని వేణు మరియు తెలంగాణ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ మరియు , రమేష్,భరత్,అజయ్,ఉమేష్, సాయి,అర్జున్, హరీష్,నరేష్ పాల్గొనడం జరిగింది