mahabubad local news telugu news

రానున్న మూడు రోజుల పాటు వర్షాలు ఎక్కువగా ఉన్నందున
అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా జాగ్రత్తగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్ కార్యాలయం నుండి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న మూడు రోజులు వర్షాలు: ఉన్నాయని, జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్ : లతో శనివారం మధ్యాహ్నం వర్షాల పై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు అని వారి ఆదేశాలను సారం ఆదివారం, సోమవారం సెలవు రోజులు అని ఎవరూ రిలాక్స్ కావద్దని, అందరూ స్థానికంగా ఉండి విధులు నిర్వహించాలని, అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.. అందరూ కష్ట పడుతున్నారని, ఎక్కడా కూడా నిర్లక్యంగా ఉండరాదని తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఒకటి, రెండు చోట్ల ప్రమాదాలు జరిగాయని, లో లైన్ కాజ్ వే, బ్రిడ్జిలపై ఓవర్ ఫ్లో సందర్భంలో ఎవరూ కూడా దాటరాదని, బారికేడ్లు పెట్టి ఆపాలని తెలపడం జరిగిందని, బారికేడ్లు పెట్టి కంప, ముళ్ల పొదలు అడ్డంగా వేయాలని, ఎవరూ కూడా దాటి వెల్లకుండా చూడాలని, తొర్రూరు కంఠాయపాలెం దగ్గర వాగులో బారికేడ్లు పెట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్న సందర్భంలో ఒక వ్యక్తి ఎలా ఓవర్ ఫ్లో అవుతున్న సందర్భంలో దాటుటకు ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నంలో కొట్టుకొని పోవడం జరిగిందని, అధికారులు చెప్పిన కూడా దాటడం జరిగిందని చెప్పడం సబబు కాదని, ఎట్టి పరిస్తితిలో దాటనివ్వకుండా పర్యవేక్షణ, కట్టడి చేయాలని తెలిపారు. ప్రాణాలు నిలబెట్టడానికి కఠినంగా వ్యవహరించాలని, పకడ్భందిగా కట్టడి చేయాలని తెలిపారు. తొర్రూర్ డివిజన్ లో అత్యధికంగా వర్షాలు పడుతున్నాయని, జిల్లాలో ఆర్ అండ్ బి. పంచాయితీ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ కు సంబంధించిన మొత్తం 32 రోడ్ల మీద నుండి నీరు ఓవర్ ఫ్లో అవుతున్నందున బారికేడ్లు, ముళ్ల పొదలు, కంపలు వేసి పూర్తిగా మూసివేసి రాకపోకలు జరగకుండా చూడాలని తెలిపారు.. రిలీఫ్ సెంటర్ లు ఏర్పాటు చేయుటకు ప్రదేశాలను గుర్తించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
మరిపెడ టీం శుక్రవారం రాత్రి అప్రమత్తంగా ఉండి 22 మందిని ఎన్డీ ఆర్. ఎఫ్. సిబ్బందిచే రక్షించడంలో బాధ్యతా యుతంగా పని చేసి వారిని కాపాడడం జరిగిందని, అలర్ట్ గా ఉండి సేవలు అందించినందుకు, వారి ప్రాణాలు కాపాడినందుకు టీం మొత్తాన్ని కలెక్టర్ అభినందించారు.ఎవరూ కూడా వాగులు, చెరువులు దాటకుండా పోలీస్ సిబ్బంది. అడ్డుకోవాలని, తగు జాగ్రత్తలు పాటించే విధంగా చూడాలని తెలిపారు.ఈ టెలీ కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతం, జిల్లా అధికారులు,
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.