ఇంక్రెడిబుల్ ఇండియా సదస్సుకు హాజరై ప్రసంగించిన పర్యావరణ పరిరక్షణ బాధ్యులు

ఇండియా టూరిజం మరియు తెలంగాణ టూరిజం సంయుక్తంగా నిర్వహించిన ఇంక్రెడిబుల్ ఇండియా సదస్సుకు హాజరై ప్రసంగించిన పర్యావరణ పరిరక్షణ బాధ్యులు మరియు తెలంగాణ ప్రైవేట్ టీచింగ్ నాన్-టీచింగ్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు డా.సామల శశిధర్ రెడ్డి…… ఇండియా టూరిజం తెలంగాణ టూరిజం మరియు తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో హనుమకొండ లోని హరిత కాకతీయ హోటల్ లో ఇండియా టూరిజం అసిస్టెంట్ డైరెక్టర్ సతరూపా దత్త అధ్యక్షతన నిర్వహించిన ఇన్క్రెడిబుల్ ఇండియా సదస్సుకు ముఖ్య అతిధి ఎంజె అక్బర్ గారు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వరంగల్ మరియు పర్యావరణ పరిరక్షణ బాధ్యులు డా సామల శశిధర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ భారత దేశమే టూరిజంకు పట్టుకొమ్మని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక ప్రాంతాలు మన భారతదేశంలో విస్తారంగా ఉన్నాయని అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అతి సుందరమైన జలవనరులు భూగర్భ ఖనిజ సంపద అడవులు రాజుల కాలంలో కట్టినటువంటి కోటలు దేవాలయాలు చూడదగ్గ పర్యాటక కేంద్రాలు చాలా గొప్పగా ఉన్నాయి. కనుక ఇండియా టూరిజం మరియు తెలంగాణ టూరిజం శాఖ వారు గత కొద్ది సంవత్సరాలుగా పర్యాటక రంగం పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని తద్వారా భారత దేశంతో పాటు మన తెలంగాణ రాష్ట్రం సైతం పర్యాటక రాష్ట్రంగా దినదిన అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ఇందులో భాగంగా యువత ఈ ఒక్క అవకాశాన్ని సద్వినియోగ పరచుకుని టూరిజం కోర్సులు చదవాలని అందుకు తగిన ప్రోత్సాహం పర్యాటకశాఖ అందిస్తుందని పర్యాటక శాఖలో ఉద్యోగ అవకాశాలతో పాటు స్వయం ఉపాధి లభిస్తుందని కనుక ఇండియన్ టూరిజం వారు నిర్వహిస్తున్న ఆరు నెలల టూరిస్ట్ ఫెసిలిటేటర్ కోర్సును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు ప్రస్తుతం కరోనా కారణంగా దేశంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లిందని పది నెలల తర్వాత కాస్త ఉపశమనం కలిగే దిశగా అడుగులు పడుతున్నాయని ఇలాంటి స్వయం ఉపాధి కోర్సులను యువత సద్వినియోగ పరుచుకోవాలి అని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇండియా టూరిజం శాఖ మరియు తెలంగాణ టూరిజం శాఖ ప్రతినిధులు మరియు తెలంగాణ అటవీ శాఖ అధికారులు వరంగల్ భూపాలపల్లి ములుగు జిల్లాల యువతీ యువకులు అభ్యర్థులు మన ప్రేమికులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.