ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మధిర మండలంలోని జూనియర్ కళాశాల బంద్ విజయవంత..

ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధు..

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) మధిర టౌన్ & మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని ఫెయిలైన విద్యార్థులకు పాస్ మార్కులు ఇచ్చి వారికి ప్రమోట్ చేయాలని, తక్కువ మార్కులు వచ్చిన వారికి ఫ్రీగా రీవాల్యుయేషన్ చేయాలని ,విద్యార్థుల ఆత్మహత్యలను ఆపాలని, చనిపోయిన విద్యార్ధులకు ఇరవై అయిదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, మధిర పట్టణ మండలాల్లో జూనియర్ కాలేజీలను బంద్ చేయడం జరిగింది.. అనంతరం భగత్ సింగ్ సెంటర్ లో రోడ్డు దిగ్బంధనం చేయడం జరిగింది ప్రకటించారు.ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధు మాట్లాడుతూ :- ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో చాలా తక్కువ శాతం(49%) పాస్ కావడం, పాసైన వారిలో కూడా అనేక మంది విద్యార్దులకు తక్కువ మార్కులు రావడం ఇంటర్ బోర్డు వైపల్యనికి నిదర్శనం… కరోనా కారణంగా విద్యార్థులకు సరిగ్గా క్లాస్ లు జరగలేదు… విద్యార్థులు కూడా ఎవ్వరు పరీక్షలు రాయడానికి సంసిద్ధంగా లేని సమయంలో ఎలా రాసిన పాస్ చేస్తాము నామ మాత్రపు పరీక్షలే అన్న ఇంటర్ బోర్డు తప్పుడు నిర్ణయాల వలన ఇంత తక్కువ రిజల్ట్ వచ్చిందని ఇప్పుడు వచ్చిన రిజల్ట్ లో ఫెయిలైన విద్యార్థుల్లో కొందరు పదో తరగతిలో 10/10 జీపీఏ గ్రేడ్ వచ్చిన వారు కూడా వుండటం ఈ పరీక్షల నిర్వహణ సమంజసం కాదనే విషయాన్ని తెలియజేస్తోంది. ఏప్రిల్ లో నిర్వహించాల్సిన పరీక్షలను ఆరు నెలలు ఆలశ్యంగా పెట్టినారు. కోవిడ్ వలన కాలేజీలు పనిచేయని విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు పెట్టినా విద్యార్థులు రాయలేరనే విషయాన్ని SFI మిగితా, విద్యార్థి, తల్లిదండ్రుల సంఘాలు చెప్పినా వినకపోవడం బోర్డు బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇప్పటికైనా ఫెయిలైన విద్యార్థుల్లో ఆందోళనను, వత్తిడిని నివారించడానికి బోర్డు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడం జరిగింది…

డిమాండ్స్:

1) ఫెయిలైన విద్యార్థులకు పాస్ మార్కులు వేసే ప్రమోట్ చేయాలి.

2) ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేసి బోర్డు కార్యదర్శిని తొలగించాలి..

3) మరణించిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి..మరణించిన ఒక్కొక్క విద్యార్థికి 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలి.

4) విద్యార్థుల ఆత్మహత్యలను నిరోధించాలి…

5) ఇంటర్ విద్యార్థుల మరణాలపై స్పందించని విద్యాశాఖ మంత్రి ని తొలగించాలి…

ఈ కార్యక్రమంలో టౌన్ & మండల కమిటీ సభ్యులు సభ్యులు పేరు స్వామి, ప్రదీప్, జగదీష్, రాకేష్, రవి, రాజు, రాజేష్, రవీంద్ర, జగన్, గీతా, లక్ష్మి, నిహారిక, ధనలక్ష్మి, ప్రియాంక, అనూష తదితరులు పాల్గొన్నారు…

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.