YSR తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సూర్యాపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ పిట్ట రాంరెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు గుంపుల, తిరుమలగిరి, మరియు వల్లభాపురం, ఉండ్రుగొండ గ్రామాల్లో ఇంటింటికీ YSR తెలంగాణ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పిట్ట రాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పథకాలను, ఆయన సంక్షేమ పాలనను గుర్తు చేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్రలో ప్రజలకు ఇస్తున్న హామీలను ప్రజలకు తెలియజేస్తూ, మళ్లీ వైయస్ షర్మిల తోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన సాధ్యం అవుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్షులు, పార్టీనాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు గ్రామ గ్రామాన ప్రతి ఇంటికీ వెళ్లి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ మరియు వరంగల్ జిల్లా ఆబ్సర్వర్ బీరవెల్లి శ్రీనివాస్ రెడ్డి, సూర్యాపేట నియోజకవర్గ ఆబ్సర్వర్ దేవరం లింగారెడ్డి, సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు డేగల రమేష్ నాయుడు, స్టేట్ యూత్ కోఆర్డినేటర్ లోడంగి గంగాధర్, బీసీ అధ్యక్షుడు తండు భాస్కర్, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు గోరంట్ల సంజీవ, చివ్వెంల మండలం అధ్యక్షులు మూగ వెంకట్రామిరెడ్డి, పెన్పహాడ్ మండల అధ్యక్షులు జనార్ధన్ చారి, నల్లబోలు రాఘవరెడ్డి, ఎండి రఫీ, సతీష్, మల్సుర్, ఇరుగు శాంతికుమార్, అంజి యాదవ్, సురేష్, కొండ రవి, శ్రీశైలం, ఎండి బాబు, తదితరులు పాల్గొన్నారు
