రేగొండ E69 న్యూస్ :జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని చిట్యాల-పరకాల ప్రధాన రహదారిపై ఇండ్ల మధ్యలో గల వైన్స్ షాప్ ను తొలిగించాలని ఆ కాలనీ మహిళలు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. మందుబాబుల ఆగడలతో మహిళలు ఇంటి నుండి బయటకి రాలేకపోతున్నాము అని వాపోయారు, వెంటనే వైన్స్ షాప్ ను కాళీ చేయించాలని, ప్రభుత్వ అధికారులు తమ గోడును పట్టించుకోవాలి అని విన్నవించారు.వైన్స్ షాప్ ని వెంటనే తరలించకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని హేచ్చరించారు.