seethaka news mulugu news

పంట నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా విత్తనాలు అందించాలి
ముఖ్య మంత్రి కెసిఆర్ గారి పర్యటన చేసి వారం గడుస్తున్న ఇంకా పరిహారం ఇవ్వాళే
ముంపు గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం లో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు మాట్లాడుతూ గత 10 రోజులుగా కురిసిన వర్షాలకు ఖరీఫ్ ఆరంభంలోనే పంట నష్టం వాటిల్లడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులను గుర్తించి సాగు ఖర్చులైనా పరిహారంగా చెల్లించాలని సీతక్క గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ములుగు నియోజక వర్గం లో
గోదావరి వరుద వుద్రితి మూలానవరి,మొక్కజొన్న,పత్తి పూర్తి స్థాయిలో ఇసుక మేటలు పెట్టిన దుస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పంట నష్టాన్ని అంచనా వేసి నష్ట పోయిన రైతులకు ప్రతి ఎకరాకు 10 వేలు ఇచ్చి ఆదుకోవాలి పంటల బీమా అమలు చేయకపోవడంతో నాలుగేండ్లుగా వివిధ కారణాలతో నష్టపోయిన 46 వేల మంది రైతులకు పరిహారం అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ పేరిట పంట బీమాను ఎత్తివేయడం సరికాదని సీతక్క గారు రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న
మాజీ మండల అధ్యక్షులు కొంపెళ్లి శ్రీనివాస్ రెడ్డి,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి,యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.