ఇనుగుర్తి మండల ఏర్పాటు.." బాధ్యత టీఆర్ఎస్ పార్టీదే

  • ఎంపీ, ఎమ్మెల్యే గార్ల సహకారంతో..త్వరలోనే మండల ఏర్పాటు
  • మండల ఏర్పాటు..ఆలస్యమైతే మా పదవులకు రాజీనామాలు చేయడానికైనా సిద్ధమే
  • ఇనుగుర్తి ప్రజల ఆకాంక్ష మరికొద్ది రోజుల్లోనే నెరవేరనుంది
  • ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పుడు..నిరసనలు చేయడం పద్ధతి కాదు
  • మండలం..ఇస్తామంటుంటే ధర్నాలు చేయడం వెనుక మీ ఉద్దేశ్యం ప్రజలకు అర్థమవుతుంది
  • రాజకీయ లబ్ధి, వ్యక్తిగత అస్థిత్వాలను కాపాడుకునేందుకే ఈ ధర్నాలు, పాదయాత్రలు
  • ఇప్పటికైనా..మండలం ఏర్పాటు బాధ్యత టీఆర్ఎస్ పార్టీ నాయకులదే..ఇచ్చేది తెరాస ప్రభుత్వమే
  • ఇనుగుర్తి లో..టీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ లో సర్పంచ్ దార్ల రాంమూర్తి, సొసైటీ ఛైర్మన్ దీకొండ వెంకన్న, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు

కేసముద్రం: ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే, ఎంపీ గార్లు ఇనుగుర్తి మండలం చేస్తామని ప్రకటిస్తున్నా..వినకుండా మండల ప్రయత్నాలలో కలిసిరాకుండా ధర్నాలు, రాస్తారోకోలు, పాదయాత్రలు, నిరసనలు చేయడం అర్థ రహితమని ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ దార్ల రాంమూర్తి అన్నారు. ఈ క్రమంలో ఇనుగుర్తి గ్రామంలో..సోమవారం నాడు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో “ఇనుగుర్తి మండల ఏర్పాటు” అంశంపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో..ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ దార్ల రాంమూర్తి మాట్లాడుతూ..టీఆర్ఎస్ పార్టీ ఇనుగుర్తి మండల ఏర్పాటుకు కట్టుబడి ఉందని..మొదటి నుండి ప్రభుత్వాన్ని డిమాండ్..చేయడమే గాక ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ప్రయత్నాలను చేసింది..టీఆర్ఎస్ పార్టీ నాయకులేనని..ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత గార్ల చొరవతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ల దృష్టికి ఇప్పటికే తీసుకువెళ్ళారని తెలియజేశారు. గతంలో..మండల ప్రతిపాదన చేసినా కొన్ని సాంకేతిక కారణాల వల్లనే మండల ఏర్పాటు కాలేదని..గుర్తు చేశారు.

ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ గారు, ఎంపీ మాలోత్ కవిత గారు, మంత్రులు దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వద్దిరాజు కిషన్, రవిచంద్ర గార్ల ప్రత్యేక చొరవతో..ఇటీవలే మంత్రి కేటీఆర్ గారికి విన్నవించుకోగా..త్వరితగతిన ఇనుగుర్తి మండలాన్ని ఏర్పాటు చేస్తామని వారు హామీ కూడా ఇవ్వడం జరిగిందని..అంతే కాక ఈ మద్యలనే ఎంపీ మరియు ఎమ్మెల్యే గార్లు పలువేదికలపై కూడా..”ఇనుగుర్తి మండలం ఏర్పాటు” అంశాన్ని ప్రస్తావిస్తూ గ్రామ ప్రజలకు స్పష్టమైన హామీలను తెలియపరిచారు..అయినప్పటికీ ప్రభుత్వం మండలం ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నా కూడా..ఎంపీ, ఎమ్మెల్యే గార్ల హామీలను అర్థం చేసుకోకుండా.. అఖిల పక్ష పార్టీలు కావాలనే రాద్ధాంతం చేస్తూ..వారి వారి రాజకీయ లబ్ధి కోసం పాదయాత్రలు, ధర్నాలు, నిరసనలు, ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ..రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.

ఇనుగుర్తి మండలం ఏర్పాటు అంశాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకుల భుజస్కంధాలపై వేసుకుని..ఎమ్మెల్యే, ఎంపీ, వద్దిరాజు రవిచంద్ర గార్ల ఆధ్వర్యంలో త్వరలోనే సీఎం కేసీఆర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని త్వరితగతిన ఇనుగుర్తి మండలాన్ని సాధిస్తామని, ప్రభుత్వం ద్వారా ఇనుగుర్తి మండలాన్ని తెచ్చేది మేమేనని స్పష్టం చేశారు.. ఒకవేళ మండల ఏర్పాటు అంశం ఆలస్యమైతే గ్రామంలోనున్న టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామాలు చేసైనా మండలాన్ని సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని శపథం చేశారు.

ఈ సమావేశంలో..కేసముద్రం పీఏసీఎస్ చైర్మన్ దీకొండ వెంకన్న, ఉమ్మడి ఇనుగుర్తి సర్పంచులు మామిడి శోభన్, బానోత్ రామన్న, ఉపసర్పంచ్ గుండ్రపెల్లి దేవేందర్, టీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి మహేందర్ రెడ్డి, గ్రామ పార్టీ ప్రధానకార్యదర్శి గండు నాగన్న, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పప్పుల వెంకన్న, కూటికంటి మధు, పప్పుల వెంకన్న (108), నవనందుల శ్రీనివాస్, వేముల శ్రీనివాస్, దార్ల భాస్కర్, వార్డు సభ్యులు గాడుదుల రాజన్న, కుమారస్వామి, బోల్ల కొమురయ్య, నాయకులు ఎలమద్రి ప్రభాకర్ జక్కుల విజేందర్, వల్లంల హరికృష్ణ, చంద్రయ్య చారి, శివరాత్రి ఇద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.