సముద్రాల గ్రామంలో పర్యటించి భారీ వర్షాలకు గ్రామంలో కూలిపోయిన బావిని మరియు తీవ్రంగా డ్యామేజ్ అయిన రోడ్డును సందర్శించి తాత్కాలిక మరమ్మత్తులు చేయించి పరిశీలించిన మంత్రి,ఎమ్మెల్యే

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్పూర్ జులై 11

గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని సముద్రాల గ్రామం నందు గ్రామంలోకి వెళ్లే రోడ్డు పక్కన గల పురాతన వ్యవసాయ బావి(మైసమ్మ బావి) దరి కూలడం వలన మరియు భావిదరి కూలిపోవడ మే కాకుండా బావి పక్కనే గల బీటీ రోడ్డుకు భారీ గండిపడి భారీగా డ్యామేజ్ అయినందున కుంగిన బావిని దానివలన డ్యామేజ్ అయిన రోడ్డును అక్కడ చేస్తున్న తాత్కాలిక మరమ్మత్తులను రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య క్షేత్రస్థాయిలో సందర్శించి అక్కడి పరిస్థితులను మరియు బావి పూడ్చుటకు చేయబడిన తాత్కాలిక మరమ్మత్తులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ & జిల్లా పార్టీ అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య మరియు జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.గ్రామప్రజలకు ఇబ్బందులు కలుగకుండా బావిని పూడ్చి ,గండి పడిన రోడ్డుకు తాత్కాలిక మరమ్మత్తులు చేసినందుకు గాను ప్రజాప్రతినిధులను మరియు అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు.ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని సూచించారు.గ్రామాలలో ప్రజలు ఇనుప విద్యుత్ స్తంభాల దగ్గరకు గాని కరెంటు తీగల జోలికి పోవద్దని వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండే రైతులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని , సంబురానికి కూడా ఎవ్వరూ నీటి ప్రవాహాల వద్దకు గాని వరదల వద్దకు పోవద్దని సూచించారు.
ఈ సముద్రాల మైసమ్మ బావిని పూడ్చుటకు గాను తక్షణమే రూ.20 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు,వరదలకు అతలాకుతలమైన పలు ప్రాంతాలలో తాజా పరిస్థితులు,పునరావాస చర్యలు, అంటువ్యాధులు,సీజనల్ వ్యాధుల నివారణ వంటి పలు అంశాల పై దృష్టి పట్టాలని మంత్రి ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు సూచించారు.ఈ వానాకాలం మొత్తం కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త వహించాలని సూచించారు.లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు పంపాలన్నారు. పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు.వర్షాల తర్వాత అంటు వ్యాధులు,సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ మేరకు అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని జిల్లా అధికారులకు అదేశించారు.వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని త్రాగునీరు సరఫరా మరియు పారిశుధ్యములను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.సదరు బావిని గ్రామపంచాయతీకి దానంగా రాసిచ్చిన రైతులు ఇనుగాల నర్సింహ రెడ్డి మరియు ఇనుగాల సుధీర్ రెడ్డిలను ఈ సందర్భంగా మంత్రి శాలువాతో సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ మారపాక రవి, స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ
చైర్మన్ గుజ్జరి రాజు,
ఎంపీపీ కందుల రేఖగట్టయ్య,డిఆర్డీఓ రామ్ రెడ్డి,ఆర్డీవో కృష్ణవేణి,డిపిఓ రంగాచారి,తహశీల్దార్ పూల్ సింగ్ చౌహన్, ఎంపీడీఓ కుమారస్వామి, డిఈ రాజగోపాల్,మండల పార్టీ అధ్యక్షులు మాచర్ల గణేష్,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు తాటికొండ సురేష్ , మార్కెట్ వైస్ ఛైర్మన్ చల్లా చందర్ రెడ్డి ,స్థానిక సర్పంచు గుండె విమలనర్సయ్య , ఎంపీటీసీ పడిశాల సుగుణ వెంకటేష్ ఇతర ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు,మహిళ ప్రతినిధులు మరియు గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.