ఇఫ్తార్ విందులు,రంజాన్ తోఫాలు కాదు చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించాలి

ఫ్తార్ విందులు,రంజాన్ తోఫాలు కాదు, బడ్జెట్ సబ్ ప్లాన్ చట్టం, బడ్జెట్లో 5000 కోట్లు కేటాయించి నిరుద్యోగ యువతకు, చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ…..

రంజాన్‌ నెలలో ఇఫ్తార్ విందుల కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ. 8 కోట్లు, రంజాన్ తోఫాల కోసం రూ. 21 కోట్లు కేటాయించిందని, ఇవి ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ఉపయోగిపడేవి కాదు కాబట్టి ఇఫ్తార్ విందులను, తోఫాలకు కాకుండా అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలి.

2022 – 23 వార్షిక బడ్జెట్ లో మైనార్టీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1740 కోట్లు మాత్రమే కేటాయించింది. రాష్ట్రంలో 14% జనాభా ఉన్న మైనార్టీలకు ఇంత తక్కువ బడ్జెట్ కేటాయించడం అన్యాయం. కావున పునర్ సమీక్ష జరిపి మైనార్టీ బడ్జెట్ ని రూ. 5000 కోట్లకు పెంచాలి, రోడ్ సైడ్ చిన్ వ్యాపారులకు, పండ్లు, కూరగాయలు అమ్మేవాళ్ళు, చాయ్ డబ్బాలు, మెకానిక్ లు, ఆటో- కార్ డ్రైవర్లు తదితరులను రూ. 2 లక్షల సబ్సిడి లోన్లు ఇవ్వాలి.
గత 8 సంవత్సరాలుగా మైనారిటీ సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్ లో ఖర్చు కాకుండా మిగిలిన దాదాపు రూ. 4000 వేల కోట్లకు పైగా నిధులను క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ సంవత్సరం ఖర్చు చేయాలి. మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి ‌
వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ పవర్స్ కల్పించాలి.
మైనారిటీ గురుకులాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలి, అందుకు వక్ఫ్ భూములను వాడుకోవాలి.డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో పేద ముస్లింలకు 12% కేటాయించాలి. మైనార్టీ కమీషన్, ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీలను నియమించాలి. మతోన్మాద, విచ్ఛిన్నకర మూకల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి, లౌకిక ప్రజాస్వామిక విలువలను కాపాడాలని కోరుతున్నాము

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.