ఇరిగేషన్ అధికారుల పై ప్రివిలేజన్ కమిటీకి పిర్యాదు

ఆదివాసీ మహిళ ఎమ్మెల్యే అయినందుకా ఈ వివక్షత
ప్రతి పక్ష పార్టీ ఎమ్మెల్యే అయినందుకా
స్థానిక ఎమ్మెల్యే కు సమాచారం ఇవ్వకపోవడం లో ఆంతర్యం ఎంటి
ఇరిగేషన్ అధికారుల పై ప్రివిలేజన్ కమిటీకి పిర్యాదు చేస్తా
పక్క జిల్లా అధికారులు వచ్చి మన జిల్లాలో పెత్తనం చేస్తే మాన జిల్లా అధికారులు ఊరుకుంటారా
రామప్ప చెరువు నిండుతే నష్ట పోయేది మా రైతులు నీట మునిగేది మా భూములు
భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించకుండా మంది మర్బలం తో వచ్చి గేట్లను ఓపెన్ చేస్తారా
గండ్ర వెంకటరమణారెడ్డి ఖబర్ధార్
అధికార బలం తో నీ పార్టీ గుండాలతో మా రైతులపై మా కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేపిస్తావా
నేను నీ నియోజకవర్గానికి వస్తా అప్పుడు తెలుస్తుంది నీ బలం ఎంటో నా బలం ఎంటో
ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం లో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు మాట్లాడుతూ నిన్న పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు వ్యవహరించిన తీరు ఒక గుండలా రౌడీ లా పోలీసులను మోహరించి ఒక మిడుతల దండు లాగ నీ కార్యకర్తలను వెంట పెట్టుకొని మా నాయకులపై మా నియోజకవర్గ రైతుల పై దాడులు చేసి రామప్ప చెరువు నుండి వంగ పెల్లి చెరువు కు నీళ్లను తరలించు కు పోతావా
మీరు నీళ్లను తీసుకు పోయె దానికి నేను వ్యతిరేకించలేదు కానీ
నీ గుండా లా ఒక అహంకారం తో మా రైతులపై మా కార్యకర్తలపై దాడులు చేస్తే నీకు బయటపడటానికి ఇక్కడ ఎవ్వరూ లేరు
స్థానిక ఎమ్మెల్యే గా ఈ ప్రాంత ఆడబిడ్డ గా నన్ను కనీసం అహ్వానించకుం డా ఇరిగేషన్ అధికారులు అవమానిస్తారా గత యేడాది రామప్ప చెరువు నిండడం ములనా సుమారుగా ఏడు గ్రామాలు ఇంచేర్ల,జంగాల పల్లి, కేశా వా పూర్,నర్సాపూర్,పాపయ్య పల్లి బండారు పల్లి,పల్సబ్ పల్లి గ్రామాలు పూర్తిగా నిట మునిగి పంట పొలాలు వర్షాలకు మొత్తం నీట మునిగి మా రైతులు నష్ట పోతే కనీసం ఒక్క రూపాయి కూడా మా రైతులకు పరిహారం ఇవ్వలేదని
ఇక్కడి చెరువు నుండి నర్సం పేట సిద్దిపేట,హైదరాబాద్,గణపసముద్రం వరకు లైన్లు వేసుకొని నీళ్ళు తీసుకుపోతున్నారు కానీ ఈ ప్రాంతానికి ఒక చుక్క నీరు ఇవ్వరు
రామప్ప చెరువు నుండి కేషా వా పూర్ అవతలి వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర మా నియోజకవర్గ రైతుల భూములు కోల్పోయి పరిహారం అందక ఇబ్బందులు పడుతుంటే హడావిడిగా ఒక స్థానిక ఎమ్మెల్యే లేకుండా నీళ్లను తీసుకు పోతారా
గండ్ర వెంకటరమణారెడ్డి నువ్వు ప్రతి పక్ష పార్టీ నుండి గెలిచి అధికార పార్టీ లోకి పోగానే అడిందే ఆ ట పాడిందే పాట అంటే అది నీ మూర్ఖత్వం అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
కాలువ సరిగా లేకపోవడం వలన కాలువ గుండా మొత్తం గండ్లు పడటం ములన మళ్లీ మా రైతుల భూములు నీట మునిగే పరిస్థితి ఉన్న కూడా దౌర్జన్యంగా గుండా ల మా రైతుల పై దాడులు చేసి నీళ్లను తీసుకు పోతారా
ప్రొటకాలు పాటించకుండా నన్ను అవమానించిన అధికారులపై ప్రివిలేజ్ కమిటీకి పిర్యాదు చేస్తా
ముఖ్య మంత్రి గారు దీనిపై స్పందించాలి గండ్ర వెంకటరమణారెడ్డి నీ లాగా ఒక పార్టీ బిక్ష తో గెలిచి ఇంకో పార్టీలోకి నేను పోలే నీలాగా నాకు అహం అహంకారం నాకు లేదు ప్రజల కష్ట సుఖాలను తెలిసిన నాకు ప్రజల అండ దండలు ఉన్నాయి
ఈ ప్రాంత నుండి నీళ్లను తీసుకు పోయె దాని మీద ఉన్న ప్రేమ ఈ ప్రాంత రైతుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని సూటిగా అడుగుతున్న
ఈ కాలువ గుండా మొత్తం గండ్లు పడటం జరిగిందని గండ్లు పుడ్చకుండ మరమ్మతులు చేపట్టకుండా ఓపెన్ చెయ్యడం వలన మళ్లీ మా రైతుల పంట పొలాలు నీట మునిగే పరిస్థితి మా రైతుల కు అన్యాయం జరుగుతే ఊరుకునేది లేదు ప్రోటకాల్ పాటించ కుండా నన్ను అవమించిన అధికారులు మీ జిల్లా పరిధిలోకి పక్క జిల్లా అధికారులు వచ్చి పెత్తనం చేస్తే మీరు ఊరుకుంటారా వాళ్ళను అడ్డుకోబోయేది పోయి మా రైతుల మా కార్యకర్తలను అడ్డు కుంటారా రేపు రామప్ప చెరువు నిండిన తర్వాత మా రైతుల భూములు మునిగిపోతే నేనే స్వయంగా వచ్చి తుమును తవ్వుతా ఏ అధికారి వస్తాడో చూస్తా
అని తీవ్ర స్థాయిలో అధికారుల పై మండిపడ్డారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నో జు సూర్యనారాయణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జా టోత్ గణేష్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు విరేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మైస ప్రభాకర్
ఎంపీటీసీ లు బానో త్ భాస్కర్, మవురపు తిరుపతి రెడ్డి,మూషిన పెల్లి కుమార్ గౌడ్,కునూరి అశోక్ గౌడ్, సర్పంచులు రాజీ రెడ్డి,గండి కల్పన కుమార్,గ్రామ కమిటీ అధ్యక్షులు అశోక్,
కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు,వైస్ చైర్మన్ రాజేందర్
రైతు మునేందర్,పికే
స్వామి,నర్సయ్య,,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,అధికార ప్రతినిధి ఆంగోత్ వంశీ,మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తారక్,యూత్ నాయకులు అజ్మీరా శ్రీధర్,మేడం రమణ కర్,కట్టే కోళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారుఇరిగేషన్ అధికారుల పై ప్రివిలేజన్ కమిటీకి పిర్యాదు చేస్తా

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.