ఇళ్ళ స్థలాల పంపిణీ లో వైయస్సార్ సిపి నాయకుల మధ్య వివాదం

చందపురం గ్రామంలో ఇళ్ళ స్థలాల పంపిణీ లో వైయస్సార్ సిపి నాయకుల మధ్య వివాదం. చిలికి చిలికి గాలి వాన ల మారింది. కోర్టు వివాదం ఉన్నందున కొంతమంది లబ్దిదారులకు పోజిషన్ ఇస్తామని, మిగత వారికి పట్టాలు పంపిణీ చేస్తారని తెలుసుకున్న గ్రామ వైయస్సార్ సిపి నాయకులు అలా కాకుండా ఒకేసారి పట్టాలు పంపిణీ చేయలనీ నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామంలో లబ్దిదారులు, వైయస్సార్ సిపి నాయకులు పట్టాల పంపిణీ కార్యక్రమానికి దూరంగా ఉండటం, వైయస్స్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద నిరసన తెలిపారు. దింతో మండల పార్టీ అధ్యక్షుడు గ్రామ పార్టీ అధ్యక్షుడని క్రమశిక్షణ పేరుతో అధ్యక్ష పదవి నుంచి తప్పించినట్లు ప్రకటించారు. అలాగే ఈ కార్యక్రమానికి రాకుండా దూరంగా ఉన్న 11 మంది వాలంటీర్లు ను తోలగించడానికి ఎంపిడిఓ చర్యలు తీసుకుంటామని ప్రకటించడం తో ఇప్పటి వరకు మండల వైసిపి పార్టీ లో ఉన్నా అసంతృప్తి ఒకసారి బయట పడినట్లు అయింది. గురువారం నాడు నందిగామ నియోజకవర్గం రూరల్ పరిధిలోని చివరి రెండు గ్రామాలలో పట్టాల పంపిణీ. ఈ పంపిణీ లో నందిగామ మండలం లోని కేతవీరునిపాడు, చందపురం గ్రామంలో సుమారు 400 పై చిలుకు లబ్దిదారులకు పంపిణీ చేయవలసి ఉంది. అయితే చందాపురం గ్రామంలో అందరికి పంపిణీ చేయకుండా కోర్టు వివాదం ఉన్నందున కొంతమంది లబ్దిదారులకు పంపిణీ చేయవలసి ఉంటుందని, మరోసారి మిగతా వారందరికీ పంపిణీ చేస్తారని తెలుసుకున్న గ్రామ వైయస్సార్ సిపి నాయకులు అలా కాకుండా ఒకేసారి పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మండల పార్టీ అధ్యక్షుడు గ్రామ వైయస్సార్ సిపి నాయకులతో ఉదయం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వీరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. దీంతో గ్రామ వైయస్సార్ సిపి నాయకులు వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కి పూలమాలలు వేసి అక్కడే నిరసన వ్యక్తం చేశారు. దీంతో శాసన సభ్యులు ఇక్కడ పట్టాల పంపిణీ కార్యక్రమం కోసం కేతవీరునపాడు గ్రామం లోనే నిరీక్షణ చేయవలసి వచ్చింది. అనంతరం గ్రామానికి చెందిన నాయకులతో నందిగామ యార్డ్ ఛైర్మన్, చందర్లపాడు మండలం నాయకుడు, వీరులపాడు మండల నాయకులు మరో దఫా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ తమను నియోజకవర్గ నాయకులు అసలు పట్టించుకోవడం లేదని, తాము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, కనీసం పట్టాల పంపిణీ కార్యక్రమం వివరాలు సైతం అంట్టి ముట్టనట్లు తెలిపారని, అలాగే తాము శాసనసభ్యులు కార్యక్రమానికి హాజరు కావడం లేదని మాత్రమే చెప్పామని, మండల పార్టీ అధ్యక్షుడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారని, వర్గల వారిగా విడదీసి పని చేస్తున్నారని వారి ముందు ఆరోపించారు. అలాగే గ్రామస్తులు అందరికీ ఒకే సారి పట్టాలు పంపిణీ చేయాలని అడిగాం కాని పార్టీ కి ఎలాంటి నష్టం కలిగించలేదని అయినప్పటికీ తమపై కేసులు పెట్టించేందుకే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో తాము కార్యక్రమంలో పాల్గొన్నే సమ్యసే లేదని తేల్చి చెప్పారు. దీంతో వెనుతిరిగి వెళ్లి పోయారు మండల నాయకులు. అనంతరం యథావిధిగా శాసనసభ్యులు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తరువాత పార్టీ గ్రామ అధ్యక్షుడుని సస్పెండ్, వాలంటీర్లు పై చర్యలు వంటి ప్రకటించారు. దీంతో తదుపరి గ్రామ వైయస్సార్ సిపి నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.