#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

జర్నలిస్టు యూనియన్ ములుగు జిల్లా అధ్యక్షులు గంపల శివ కుమార్


నిజాలు బయట పెడుతున్న విలేకరులపై ఇసుక మాఫియా బెదిరింపులు దాడులను అరికట్టాలని, నిన్న మధ్యాహ్నం అక్షర విజేత విలేఖరి సలుగు బిక్షపతిపై దాడి దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని,జర్నలిస్టు యూనియన్ ములుగు జిల్లా అధ్యక్షులు గంపల శివ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం శివ కుమార్ మాట్లాడుతూ..
పినపాక నియోజకవర్గం లోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక మాఫియా అక్రమ దందా గురించి, పుంఖాను, పుంఖాలుగా అనేక అక్రమాలను మీడియా వెలుగులోకి తెచ్చినప్పటికీ, ఇసుక మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, రెచ్చిపోతున్న ఇసుక మాఫియా గుండాలు , వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న విలేకరులపై బరితెగించి దాడులకు తెగబడుతున్నారని, నిన్న మధ్యాహ్నం పినపాక మండలం జానంపేట ఇసుక అక్రమాలపై వాస్తవాలు బహిర్గతం చేయడానికి వెళ్ళిన అక్షర విజేత విలేకరి, సలుగు బిక్షపతి పై జానంపేట గిరిజన సొసైటీ ఇసుక ర్యాంపు ఆంధ్రా బినామి ఇసుక కాంట్రాక్టర్లు, సెల్ ఫోను గుంజుకుని, వాహనం లో నుండి లాగి, కింద పడేసి, విచక్షణ రహితంగా కొట్టి, కాళ్లతో తన్ని, గొంతుపై తొక్కుతూ, హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దాడికి గురైన విలేఖరి, తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. దాడి చేసిన వారే తిరిగి పత్రిక ప్రతినిధి పై అక్రమ కేసు బనాయించటానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు. వెంటనే దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో పెద్దఎత్తున సహజ వనరుల దోపిడీ జరుగుతుంటే, అరికట్టాల్సిన అధికార యంత్రాంగం నిద్రావస్థలో ఏమి పట్టనట్టు వ్యవహరించడం వల్ల, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు , అనే ధైర్యంతో భౌతిక దాడులకు తెగబడ్డారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం, ఆదివాసి గిరిజనుల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్న బినామీ వ్యక్తుల పై, కఠిన చర్యలు తీసుకొని నిజాలు బయట పెడుతున్న పత్రిక విలేకరులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.ఇసుక మాఫియా కి వత్తాసు పలుకుతూన్న అధికారుల పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.