ఇసుక రేణువులతో తయారు చేసిన ఎంపీ చిత్రపటం

కురవి మండల కేంద్రానికి చెందిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ నీలం శ్రీనివాస్ ఇసుక రేణువులతో తన స్వహస్తాలతో తయారు చేసిన మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత చిత్రపటాన్ని ఎంపీ కవితకు మహబూబాబాద్ లో నీలం శ్రీనివాస్ బహుకరించారు. ఎన్నో యేండ్లు వరకు ఈ చిత్రపటం భద్రంగా ఉంటుందన్నారు. గత సంవత్సరం ఇసుకతో ప్రపంచ పటాన్ని తయారుచేసి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ చేత ఆవిష్కరింప జరిగింది. ప్రపంచంలో ఈ విధంగా ఇసుకతో తయారు చేయడం కేవలం శ్రీనివాస్ గారికే సాధ్యం మన్నారు. ఈ సందర్భంగా కవిత శ్రీనివాస్ అభినందించారు. శ్రీనివాస్ నైపుణ్యంను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన గుర్తింపు వచ్చేలా చేస్తానని ఎంపీ కవిత హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టిఆర్ ఎస్ జిల్లా నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి,టిఆర్ ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు గుగులోతు రవినాయక్,
కురవి ఆలయ మాజీ ఛైర్మన్ బాదావత్ రాజునాయక్, యూత్
కురవి మండల అధ్యక్షుడు బాణోత్ రమేష్, ఎస్టీ సెల్ కురవి మండల
అధ్యక్షుడు బాణోత్ రాము, కురవి మండల నాయకులు బండి
యతీరాజు, సీనియర్ పాత్రికేయులు చిత్తనురీ శ్రీనివాస్, గుంటి
సురేష్, బాదే వెంకన్న, నరేష్, మదార్ తదితరులు ఉన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.