ఈడి పేరుతో రాహుల్ సోనియాగాంధీ పైన రాజకీయ కక్ష సాధింపు చర్యల

ఈడి విచారణ పేరుతో ఏఐసీసీ అగ్రనేతలు శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి సోనియాగాంధీ గార్ల పైన రాజకీయ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ హన్మకొండ హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా నిరసన తెలిపిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు..

ఏఐసిసి పిలుపు మేరకు టిపిసిసి ఆదేశానుసారం ఈడి విచారణ పేరుతో ఏఐసీసీ అగ్రనేతలు శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి సోనియాగాంధీ గార్ల పైన రాజకీయ కక్ష సాధింపు చర్యలతో వేధింపులకు గురిచేయడం, రోజుల తరబడి, గంటల విచారణలు చేయడాన్ని నిరసిస్తూ, ఏఐసీసీ కేంద్ర కార్యాలయం లోకి పోలీసులు చొచ్చుకొని వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను తీవ్రంగా కొట్టి అక్రమంగా అరెస్టులు చేయడాన్ని ఖండిస్తూ హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో (కేంద్ర ప్రభుత్వ కార్యాలయం) హన్మకొండ హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…

గాంధి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఈ యొక్క బిజేపి టిఆర్ఎస్ ప్రభుత్వాలు విచారణ పేరుతొ రోజుల తరబడి కక్ష్య సాధింపు చేయడం నిజంగానే వీళ్ళు ఏం చేసారో అనే నమ్మకం కలిగే విధంగా ఈ రెండు ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి.

బిజేపి టిఆర్ఎస్ ప్రభుత్వాలు పొద్దున్న లేస్తే వీరు ఇదే పని పెట్టుకున్నారు సోషల్ మీడియాలో గాంధీ కుటుంబం గురించి వక్రీకరిస్తూ వీడియోలు వైరల్ చేస్తూ శునకానందం పొందుతున్నారు.

ఎందుకంటే రెండు పర్యాయాలు కేంద్రంలో బిజేపి రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే ప్రజలకు చేసింది ఏమి లేదు కాబట్టి ఎక్కడ వీల్లను నిలదీస్తారనే ఉద్దేశంతో టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారు.

కులాలను మాటలను అడ్డుపెట్టుకొని ఒక పార్టీ, ప్రాంతీయ తత్వాన్ని పెట్టుకొని మరొక పార్టీ ప్రజలను రెచ్చగొడుతున్నారు.

ఈడి విచారణ పేరుతో సోనియా రాహుల్ గాంధి లపై రాజకీయ వేధింపులకు గురిచేస్తూ అరాచకం చేస్తోంది.

సుప్రీం కోర్టు ఎలాంటి అవకతవకలు లేవని చెప్పిన ఇప్పుడు అవకతవకలు జరిగాయని ఈడీ ద్వారా కావాలని నోటీసులు ఇప్పించింది అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు

నిజంగా ఈడికి చిత్తశుద్ధి ఉంటె ఎనిమిది సంవత్సరాలుగా దేశ సంపదని నిలువుగా దోచుకుంటూ అదానీ, అంబానీ చేతుల్లో పెడుతున్న మోడీ అమిత్ షా లకు ఇవ్వండి ఈడి నోటీసులు అన్నారు

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అలాంటప్పుడు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ శ్రేనులపై బిజేపి పార్టీకి తోడుగా టిఆర్ఎస్ పార్టీ పోలీసులను ఉసిగొల్పి బిజేపికి వత్తాసు పలుకుతుంది.

ఈ.డి. విచారించాదాన్ని నిరసిస్తూ శాంతియుతంగా రాజ్ భవన్ ముందు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలపై కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం

దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేసి బిజే పి వైఫల్యాలను నిలదీసేందుకు రాహుల్ గాంధి పాద యాత్రకు సన్నద్ద మవుతున్న తరణంలో బిజేపి ఆయన పాదయాత్రను అడ్డుకుని కుట్రలకు పాల్పడుతుంది.

సోనియా రాహుల్ గాంధిని ప్రజల నుండి దూరం చేయాలన్నదే బిజేపి ఉద్దేశమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కునే శక్తి లేకనే బిజేపి తన అధికారాన్ని ఉపయోగించుకుని ఈ.డి.ని ఉసగోల్పుతుంది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే మోడి నోటిసులు పంపారు.

అనంతరం పోలీసులు అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎం.పి. సిరిసిల్ల రాజయ్య, పర్కాల నియోజకవర్గ బాధ్యులు ఇనగాల వెంకట్రాం రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, పిసిసి సభ్యులు గంగారపు అమృత రావు, టిపిసిసి కార్యదర్శులు మహమ్మద్ ఆయుబ్, తౌటం రవీందర్, బొజ్జ సమ్మయ్య యాదవ్, టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, కార్పో రేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, జిల్లా ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, జిల్లా కిస్సాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పింగిలి వెంకట్రాం నరసింహా రెడ్డి,బొంపల్లి దేవేందర్, జిల్లా INTUC చైర్మన్ కూర వెంకట్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, గ్రేటర్ వరంగల్ మైనారిటీ డిపార్టుమెంటు చైర్మన్ మిర్జా అజీజుల్లా బేగ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అంకుష్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలువాల కార్తిక్, NSUI జిల్లా అద్యక్షులు పల్లకొండ సతీష్, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ ఉపద్యక్షురాలు కత్తుల కవిత, ప్రధాన కార్యదర్శి గుంటి స్వప్న, ఎర్ర మహేందర్, బొంత సారంగం, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు బంక సంపత్ యాదవ్, అంబేద్కర్ రాజు, వరంగల్ వెస్ట్ యువజన కాంగ్రెస్ అద్యక్షుడు కోడిపాక గణేష్, వరంగల్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ మహమ్మద్ ముస్తాక్ నేహళ్, డివిజన్ అద్యక్షులు, మహిళా కాంగ్రెస్ శ్రేణులు, అనుబంధ సంఘాల అధ్యక్షా కార్యదర్శులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.