రాజన్నసిరిసిల్ల జిల్లా తంగాళ్లపల్లి మండల శివారులోని చెక్ డ్యాంలో ఈతకు మొత్తం 9 మంది చిన్నారులు వెళ్లినట్లు గుర్తింపు..
అందులో 3 గురు వాసల కళ్యాణ్, కోట అరవింద్, దిడ్డి అఖిల్ క్షేమంగానే ఉన్నారు..
6 గురు చిన్నారుల కొరకు గాలింపు నిన్నటి నుండి చేపట్టగా నిన్నటి రోజు కొలిపాక గణేష్(14) డెడ్ బాడీ దొరికింది.ఇతడు 8వ క్లాస్ చదువుతున్నాడు. ఈరోజు జడల వెంకట సాయి(14)8వ క్లాస్ చదువుతున్నాడు.కొంగ రాకేష్(12)6వ తరగతి చదువుతున్నడు, శ్రీరామ్ క్రాంతి కుమార్(14)8వ తరగతి చదువుతున్నడు,అజయ్(13)9వ తరగతి చదువుతున్న మృత దేహాలు లభించాయి..వీరందరూ కూడా సిరిసిల్ల పట్టణానికి చెందిన రాజీవ్ నగర్ వాసులుగా గుర్తించారు.వీరందరూ సిరిసిల్లలోని ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు
మరోకరు సింగం మనోజ్(16 ) ఇంటర్ మిడియెట్ చదువుతున్నాడు .ఇతని మృత దేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి..