బలవంతంగా సంతకాలు తీసుకోవడం మానుకోవాలి

బలవంతంగా సంతకాలు తీసుకోవడం మానుకోవాలి…

లేకపోతే ఆందోళన ఉధృతం…

ఈరోజు మిషన్ భగీరథ జిల్లా కమిటీ సమావేశం సుందరయ్య భవన్లో జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కే రాజయ్య మాట్లాడారు, ఆయన మాట్లాడుతూ
మిషన్ భగీరథ కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈనెల 26వ తారీఖున భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. కనీస వేతనాలు, ఈ ఎస్ ఐ, పి ఎఫ్, ప్రమాద బీమా, గుర్తింపు కార్డులు, సెలవులు, పని గంటలు, ఇన్సూరెన్స్, యూనిఫామ్, బూట్లు, హెల్మెట్లు, చట్టపరమైన సౌకర్యాలు ఏ ఒక్కటి కూడా అందడం లేదని విమర్శించారు, యజమానులు ఏమాత్రం స్పందించడం లేదని అన్నారు, డీసెల్ దగ్గర అన్ని ఇస్తామని ఒప్పుకొని ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదని తీవ్రంగా విమర్శించారు, అలాగే కొంత మంది యజమానులు బలవంతంగా కార్మికుల చేత సంతకాలు పెట్టాలని బలవంతం చేయడం దుర్మార్గమని అన్నారు. సంతకాలు పెట్టకపోతే తొలగిస్తామని బెదిరిస్తున్నారని, ఇది అన్యాయం అని హెచ్చరించారు. ఇష్టానుసారంగా సంతకాలు తీసుకోవడం మానుకోకపోతే వారి కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్మికులు ఏమైనా బానిసల అని ప్రశ్నించారు. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు సుధాకర్, రాములు, బాలు కృష్ణ, ప్రభాకర్, మల్లేష్ ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.