ఈనెల 28 29 తేదీల్లో జరిగే దేశ వ్యాప్త సమ్మె ను జయప్రదం చేయండి సిఐటియు

ప్రజలను కాపాడండి దేశాన్ని రక్షించండి నినాదం ఈనెల 28 29 తేదీల్లో జరిగే దేశ వ్యాప్త సమ్మె ను జయప్రదం చేయండి సిఐటియు జిల్లా సహయ కార్యదర్శి బోట్ల చక్రపాణి

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ సంపద అయినా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ కార్మికులను యజమానులకు కట్టుబానిసలాగా మార్చే కార్మిక కోడ్ లను తీసుకొచ్చి పెట్టుబడిదారులకు సేవా చేస్తుందని ప్రజల పైన భారాలు మోపుతోందని ఈ విధానాలను నిరసిస్తూ మార్చి 28 29 తేదీలలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు వివిధ ఫెడరేషన్స్ పిలుపులో భాగంగా జరగబోయే సమ్మెలో జిల్లాలోని కార్మికులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బొట్ల చక్రపాణి పిలుపునిచ్చారు.
ఈరోజు ఖాజీ పేట మండల కేంద్రంలో స్కీం వర్కర్లతో కలిసి ఆయన సమ్మె కరపత్రం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి కార్మికుల పైన దాడి చేస్తున్నారు. కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, బేరసారాల హక్కులు లేకుండా చేస్తున్నారు. వేతనాలు ప్రభుత్వ, యాజమాన్యం నిర్ణయిస్తుందని, కార్మికులను ఎప్పుడైనా పనిలో పెట్టుకోవడం తొలగించడం యజమాన్యం ఇష్టమని, 12 గంటలు పని చేయించుకోవచ్చని ఇలాంటి అనేక కార్మిక వ్యతిరేక చర్యలు ఈకోడ్ లో ఉన్నాయని అని తెలిపారు. దేశ సంపద అయినా రైల్వే, ఎల్ఐసి, బ్యాంకులు, బొగ్గు బావులు, విమానయానం, ఓడరేవులు, రోడ్లు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. పార్లమెంటులో తనకున్న బలంతో ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాలను ప్రతిఘటించడానికి ,కార్మికులకు కనీస వేతనం 26000 నిర్ణయించి అమలు చేయాలని, కనీస పెన్షన్ 9000 నిర్ణయించాలని,స్కీం వర్కర్లు అయినా మధ్యాహ్న భోజనం, ఆశ ,అంగన్వాడి, రెండవ ఏఎన్ఎం, ఆర్ పి ,వివోఎ ,ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర వారిని కార్మికుల గుర్తించాలని, వీరందరికీ కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్, సామాజిక భద్రత, లాంటి చట్టబద్ధం సౌకర్యాలు కల్పించాలని, పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని తదితరుల డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మె జరగబోతున్న ట్లు ఆయన పేర్కొన్నారు. దేశ భక్తి పేరుతో దేశ సంపదను నమ్ముతున్న దానికి వ్యతిరేకంగా దేశ సంపదను రక్షించడానికి దేశభక్తియుత సమ్మె జరుగుతుందని ఈ సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొని మోడీ విధానాలను తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు యశోద, ఫర్వీనా, సక్కుబాయ్, సరితా, శాంతా ,స్వప్న, ప్రేమలత, సమ్మక్క, పద్మ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.