ఈరోజు జరిగే 100 రోజుల రాజ్యధికార యాత్ర ముగింపు

బహుజన సమాజ్ పార్టీ. జిల్లా ఉపాధ్యక్షలు తగరం నాగన్న కురవి మండలం సీరోల్ గ్రామంలో శనివారం బి. ఎస్.పి ఆధ్వర్యంలో జూన్ 26 తేదీన జరిగే బహిరంగ సభ సన్నాహక కార్యక్రమం నిర్వహించి గోడపత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్బంగా తగరం నాగన్న మాట్లాడుతూ బి. ఎస్.పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్ర రథసారధి సారథ్యంలో మూడు వందల రోజుల యాత్రలో భాగంగా 100 రోజుల యాత్ర ముగింపు బహిరంగ సభ హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.కావున బహుజనులు రాజ్యాధికారమే లక్ష్యంగా జరుగుతున్న కార్యక్రమానికి ఎస్ సి, ఎస్ టి, బీసీ, మైనార్టీలు, అగ్రకుల పేదలు వేల సంఖ్యలో విచ్చేసి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బహుజనులకు విద్య, వైద్యం,ఉపాధి అవకాశాలు అందక ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు.బహుజనులు బాగుపడాలంటే బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ సారథ్యంలో అధికారంలోకి రావాలని అన్నారు.ఈకార్యక్రమంలో కురవి మండలం కన్వీనర్ ఆలేటి రవి, సీరోల్ గ్రామ సెక్టార్ కమిటీ కార్య దర్శి ఆలేటి సాగర్ , తగరం రాము, సుభద్ర, మాచార్ల నరేష్, అరేంపల సుజాత, ఏశోద, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.