ఈ.డబ్ల్యూ.ఎస్ 10 శాతం రిజర్వేషన్ అమలుకు అంగీకరించా లి

తెలంగాణ రాష్ట్రంలో ఈ.డబ్ల్యూ.ఎస్ 10 శాతం రిజర్వేషన్ అమలుకు అంగీకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేసిన ఓ సి జే.ఏ.సి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సామల శశిధర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఓసి కులాలలో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించడం కోసం 2018లో ఈ డబ్ల్యూ ఎస్ 10 శాతం రిజర్వేషన్ ను అంగీకరిస్తూ చట్టాన్ని తీసుకువచ్చిన అనంతరం మన తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా ఈ డబ్ల్యూ ఎస్ 10 శాతం రిజర్వేషన్ కు నోచుకోకపోవడం గత రెండు సంవత్సరాల ఓసి జేఏసీ పోరాటాల ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఓసి కులాల్లో వెనుకబడిన వారి కోసం విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని ఈ డబ్ల్యూ ఎస్ 10 శాతం రిజర్వేషన్ అంగీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారని అందుకు తామంతా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఓ సి జేఏసీ పక్షాన కెసిఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలంగాణ ఓసి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సామల శశిధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.