-పినపాక ప్రభాకర్, రాష్ట్ర కన్వీనర్, కార్మిక సంక్షేమ సంఘం తెలంగాణ

ప్రజలను కాపాడండి! దేశాన్ని రక్షించండి!! అనే నినాదంతో కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీలలో జరిగే దేశవ్యాపిత సమ్మె కు పూర్తి మద్దతు నిస్తున్నట్లు, ఈ సమ్మె ను తెలంగాణ శ్రామిక వర్గం జయప్రదం చేయాలని కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ పిలుపునిచ్చారు.

ఈ సమ్మెకు అన్ని జాతీయ కార్మిక సంఘాలు మద్దతు తెలిపినట్లు, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు అప్ప చెపుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని, కార్మిక చట్టాలను నిరివీర్యం చేస్తూ కార్మికుల జీవితాలతో ఆటలడుతుంది అని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచి కార్పొరేట్ శక్తులకు ఇచ్చే సబ్సిడీలను పెంచుకుంటూ సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు.

వంట నూనెలు పప్పు దినుసులు ఇతర వస్తువులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆ భారం అంతా సామాన్య ప్రజలపై పడుతుందని వాపోయారు కరువు కాలంలో లాభాలు గడించిన కార్పొరేట్ శక్తులకు పన్నులు పెంచాల్సి ఉన్నప్పటికీ వాటిని పెంచకుండా వారికి మద్దతు ఇవ్వడం సరైంది కాదన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి భవిష్యత్తులో ఆ వ్యవస్థను ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర పన్నిందని ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పారు.

జాతీయ ఆస్తుల నగదీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారని విమర్శించారు జాతీయ ఆస్తులు అమ్మటం ప్రైవేటీకరణ చేయడం దేశానికి పెద్ద ప్రమాదం అని చెప్పారు వీటిని కాపాడుకునేందుకు ప్రజా ఉద్యమం నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు కార్మికులు ఉద్యోగులు తమ విధులను నిర్వహించకుండా నిరసన తెలిపితే దేశవ్యాప్తంగా సేవలు స్తంభించి పోతయని అన్నారు. హక్కులను సాధించుకునేందుకు భవిష్యత్లో బలమైన ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు‌. ఈ విధానాలకు వ్యతిరేకంగా జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.