#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

ఖమ్మం :- కేంద్ర మోడీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 28,29 తేదీలలో దేశవ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మెకు భారత విద్యార్థి ఫెడరేషన్ {ఎస్.ఎఫ్.ఐ} ఖమ్మం జిల్లా కమిటి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది… ఈరోజు జరిగిన ఖమ్మం డివిజన్ ముఖ్యకార్యకర్తల సమావేశం ప్రవీణ్ అధ్యక్షతన జరిగింది… ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వడ్రాణపు మధు మాట్లాడుతూ :- దేశంలో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశాన్ని అంగట్లో పెట్టి అమ్ముతున్నరని అన్నారు. కార్మికులను కట్టు బానిసలు చేసే దిశగా మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్ లను ఒక్క సంతకంతో కుదించుకొని చేర్చుకున్నారు. దీనివల్ల కార్మికులు కార్పొరేట్ చేతులలో కట్టు బానిసలుగా మారే అవకాశం ఉందన్నారు. 29 కార్మిక చట్ట రద్దు అంటే పదిమంది ఉండే సంఘం ఏర్పడదాన్ని హక్కు 4 కోడ్ ల వల్ల దూరమవుతుందన్నారు. 8 గంటల పని విధానం నుండి 12 గంటలకు పెంచి కార్మిక హక్కులను హరించే విధంగా 4 లేబర్ కోడ్ లు కాల రాస్తున్నాయి అన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం కూడా ఎల్ఐసి, గ్యాస్, రైల్వే బిఎస్ఎన్ఎల్, రక్షణ రంగాలను మొత్తం కార్పొరేట్ల కంపెనీలకు అమ్మి పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు… కరోనా కాలం దేశ ప్రజలు బ్రతకడానికి తినడానికి ఇబ్బంది పడితే అంబానీ, అదాని లాంటి MNC లా ఆస్తులు ఒక సెకండ్ కు మూడు మిలియన్ల ఆదాయం పొందుతుందంటే, మన దేశ ప్రధాని ఏ విధంగా బడా బాబులకు తన పూర్తి సహాయాన్ని అందిస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యారంగాన్ని కూడా కార్పొరేట్ ,MNC లకు కట్టబెట్టడానికి నూతన విద్యా విధానం 2020 తీసుకొస్తుందన్నారు. ఇది జరిగితే విద్య అనేది బడుగు బలహీన వర్గాలకు అందని ద్రాక్షలా మారుతుందన్నారు. కార్పొరేట్ MNC ఇలా ప్రతినిధి ప్రధాని మోడీ చేతల నుండి ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే మార్చ్ 28 & 29న కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో విద్యార్థులు, మేధావులు, ప్రజలందరూ ఈ సమ్మెలో పాల్గొనీ విజయవంతం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ {ఎస్.ఎఫ్.ఐ} గా కోరుతున్నాం.. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సంతోష్ రెడ్డి, రాజు, తరుణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు…

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.