ఉచిత ఆరోగ్య కేంద్ర శిబిరాన్ని ప్రారంభిస్తున్న మరిపెడ ఎంపీపీ

ఈ రోజు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండ ధర్మారం గ్రామంలో పురుషోత్తయగూడెం ఉప కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య శిభిరం కార్యక్రమంలో ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు వైద్య సిబ్బంది వర్షాకాలంలో వచ్చే అంటురోగాలు, దీర్గకాలిక వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిన నీటినే త్రాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు కరుణాకర్, కోటేశ్వరి స్థానిక సర్పంచ్ లక్ష్మి లక్పతి కార్యదర్శి నరేష్,అంగన్ వాడి టీచర్లు సుశీల,భగవతి,రోజా మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.