ఉచిత ఎరువులహామీ ఉట్టి మాటేనా? రైతులకు భారంగా పెట్టుబడి ఖర్చు

ఉచిత ఎరువుల హామీ వుట్టి మాటేనా? సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని రైతులపై పెట్టుబడి భారం తగ్గించే విధంగా ఉచిత ఎరువులను పంపిణీ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భూక్య చందు నాయక్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా భూక్య చందు నాయక్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ ……..
ఎరువుల ధరలను కంపెనీలు అమాంతం పెంచేశాయి. కేంద్రం కూడా సబ్సిడీపై నామ మాత్రంగానే వీటిని అందిస్తోంది. దీంతో అన్న దాతలకు ఎరువులు భారంగా మారుతున్నాయి. క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతుండడంతో రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్లకు కలుపుకుని సుమారు 33 లక్షల టన్నుల ఎరువులు వినియోగమవుతు న్నాయి. ఇందులో కేవలం ఒక్క వానాకాలంలోనే 26 లక్షల టన్నుల ఎరువులను రైతులు వాడుతున్నారు. రెండు సీజన్ల ఎరువు ఖర్చు రూ. 8వేల కోట్లు దాటుతున్నట్లు తెలుస్తోంది. పత్తికి ఒక్క ఎకరాకు రూ.7,500 నుంచి రూ.8వేలు, వరి కి రూ. 6వేలకు పైగా ఖర్చు అవుతుందని,ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ సంస్థ రాష్ట్రంలో ఉన్నటువంటి సొసైటీలు ముందస్తుగా ఎరువుల కొనుగోలుకు నగదు చెల్లిస్తేనే సర్కారు సొసైటీ “లకు సరిపడా ఎరువులను పంపిణీ చేస్తామని విధానపరమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రైతులకు సరిపడా ఎరువులను సకాలంలో సొసైటీల ద్వారా అందించాలని, మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లి తీసుకురావాల్సి వస్తోందని,తద్వారా ట్రాన్స్ పోర్ట్ ఖర్చు మరింత భారంగా మారుతుంది అదే విధంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమల్లోకి తీసుకురావాలని,
రాష్ట్రంలో 55 లక్షల మందికి పైగా రైతులున్నారు. యూరియా, డీఏపీ, అమోనియం ఇలా 26 లక్షల టన్నుల వరకువాడుతున్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి వీటన్నింటినీ వంద శాతం ఉచితంగా సరఫరా చేస్తాం.ఆరు నూరైనా అమలు చేసి చూపిస్తాం అని అన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.