ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని నాయిని రాజేందర్ రెడ్డిని కలిసిన మహిళలు

ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని నాయిని రాజేందర్ రెడ్డిని కలిసిన కాజిపేట 63 వ డివిజన్ కు చెందినా తిలక్ నగర్ మహిళలు..

హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి గారు కాజిపేట పర్యటనలో భాగంగా కాజిపేటకు వచ్చిన సందర్భంగా కాజిపేట 63 వ డివిజన్ కు చెందినా తిలక్ నగర్ మహిళలు గ్రేస్ మేరి & మంజుల ఆధ్వర్యంలో నాయిని రాజేందర్ రెడ్డిని కలవడం జరిగింది.

ఈ సందర్భంగా వారు తిలక్ నగర్ లో ఉన్న సమస్యలను చెప్పుకోవడం జరిగింది. మేం మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కి కష్టపడి చేస్తున్నాము, మాకు ప్రాధాన్యం కల్పించాలని అన్నారు. మా యొక్క తిలక్ నగర్లో కూడా నాయిని విశాల్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ పేరు మీద కూడా ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే మీ ఏరియాలో కూడా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అతి త్వరలేనే కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తానని చెప్పారు. అనంతరం ఆ కాలనీలో ఉన్న పెద్దమనుషులను కలిసి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ అంకుష్, జిల్లా ఎస్.సి. డిపార్టుమెంటు ఉపాధ్యక్షుడు ఆరూరి సాంబయ్య, సుంచు సుధాకర్, పాలడుగుల ఆంజనేయులు, రాష్ట్ర ఒబిసి కార్యదర్శి ఇప్ప శ్రీకాంత, మొహమ్మద్ రఫీ, కలవచర్ల రాజు, బదనపురి వెంకటాద్రి, దోమ రాజేందర్ రెడ్డి, రాజు చారి, తాళ్ళపల్లి వీర స్వామి, టి. లింగం, తౌట్టిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, ఫ్రాన్సిస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, రంగు సుధీర్, దేవరబోయిన రవికుమార్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్, గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు బొంత సారంగం, డివిజన్ అధ్యక్షులు పోగుల సంతోష్, మహమ్మద్ అజ్ గర్, వల్లపు రమేష్, తక్కలపల్లి మనోహర్ తదితరులు హాజరయ్యారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.