హనుమకొండ:
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఉచిత మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మరియు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం…
ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతలో మనోధైర్యాన్ని నింపాలనే ఉద్దేశ్యంతో భారీ ఉద్యోగ ప్రకటన చేసి పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు సైతం ఇచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా డబ్బులు వెచ్చించి శిక్షణ తీసుకోలేని పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలవాలని సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్ల వేదికగా శిక్షణను అందించి నేడు వారికి మెటీరియల్ అందించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం కల్పించిన ఇంత గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉద్యోగ సాధనలో ముందుండాలని అన్నారు. రేపు మీరందరూ ఉద్యోగ నియామక పత్రాలతో యువ అధికారులుగా తిరిగిరావలని ఆకాంక్షించారు..
ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మరియు బీసీ సంక్షేమ శాఖ అధికారులు, స్టడీ సర్కిల్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు...