ఉచిత వేసవి క్రీడా శిక్షణా శిబిరంను సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ చైర్మన్ గుగులోతు సింధూరరవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరిపెడ మున్సిపాలిటీ అధ్వర్యంలో మే 6 నుండి జూన్ 5 వరకు ఒక నెలరోజులు పాటు వివిధ క్రీడలకు ఉచిత వేసవి క్రీడా శిక్షణా శిబిరం ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాలీబాల్, బ్యాట్ మెంటేన్, కబడ్డీ, ఖో ఖో, క్యారం, చెస్, సంబదించిన గేమ్స్ కు సీనియర్ క్రీడాకారులచే ఉచిత వేసవి క్రీడా శిక్షణా శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మరిపెడ పట్టణ, గ్రామీణ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల విద్యార్ధులు మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో తమ యొక్క పేర్లు మే 4 వ తేది లోపు నమోదు చేసు కొవలన్నారు. సంప్రదించవలసిన పోన్ నెంబర్లు: బ్యాట్ మెంటేన్ జావేద్ 9550533382, కబడ్డీ, వాలీబాల్, ఖో ఖో జూనియర్ అసిస్టెంట్ మరిపెడ మున్సిపాలిటి డి. సందీప్ 8341004111, మరిపెడ మున్సిపాలిటీ టైపిస్ట్, అశోక్ రెడ్డి 9949160839, సీతారాంపురం జెడ్పిఎస్ఎస్ వ్యాయమ ఉపాధ్యాయురాలు 9490452613 లకు ఫోన్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.