ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ 2, 56, 958 లక్షల కోట్ల బడ్జెట్ లో మూడు ఎకరాల భూమి పంపిణీ , పట్టణ పేదలకు ఉపాధి హామీ పనులు కల్పన కోసం ఒక్క పైసా కేటాయించక పోవడం రాష్ట్రంలో సెంటు భూమిలేని 3.50 లక్షల దళిత కుటుంబాలతో పాటు, పట్టణ పేదలను టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చెయ్యడమే, ఇంటి జాగాలు లేని వారికి ప్రభుత్వమే స్థలాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణానికి రూ 5 లక్షలు ఇవ్వాలని సిపిఎం తెలంగాణరాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరబద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దివి: 23-03-2022 బుధవారం రోజున జనగామ పట్టణ కేంద్రంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జనగామ జిల్లా కమిటీ సమావేశానికి పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కా. తమ్మినేని వీరబద్రం ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ఆర్భాటంగా ప్రకటించిన ఖాళీ పోస్టుల భర్తీ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీలను దాచిపెట్టిందని వాస్తవానికి ఖాళీలు మూడు లక్షల పైగా ఉన్నాయని , పి.ఆర్.సి కమిటీ అధికారికంగా 1, 91, 126 పోస్టులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వంకు రిపోర్టీ ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి 91, 143 మాత్రమే ఖాళీలు ఉన్నట్లు ప్రకటించడం ఆందోళకరం అన్నారు. ఈ పోస్టుల భర్తీకి కావాలిసిన నిధులు బడ్జెట్ లో ఒక్క పైసా కేటాయించక పోవడం చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి , బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై నోరు విప్పలేదన్నారు. పొడుసాగుదారులకు హక్కుపత్రాలిస్తామని , కొత్తరేషన్ కార్డులు , కొత్త పింఛన్లు కోసం తీసుకున్న అప్లికేషన్లపై ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం అట్టడుగు వర్గాల ప్రజలను నిలువునా మోసం చెయ్యడమేనని విమర్శించారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లకు, ఇంటిస్థలం ఉన్నవాళ్లకు మూడు లక్షల నగదు ఇస్తాం అంటూనే బడ్జెట్లో రూ 12 వేల కోట్లు కేటాయించడం చూస్తే డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంను తుంగలో తొక్కినట్లే అన్నారు. ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి 5 లక్షల నగదు సాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. తెల్లరేషన్ కార్డులు కోసం, 57 ఏండ్ల లోపు ఉన్న వారు పింఛన్ల కోసం ధరకాస్తులు మీసేవలో చేసిన వారు లక్షల్లో ఉన్నారని వారి గురుంచి మాట్లాడకపోవడం కేసీఆర్ మోసం తేటతెల్లం అవుతుందని, తక్షణం అర్హులకు రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చెయ్యాలి అని, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వమే ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. డబల్ బెడ్రూమ్ పేరుతో ఇండ్ల స్థలాల పంపిణి ఆపే విధానం సరికాదన్నారు. ఉక్రేన్ రష్యా యుద్ధం సాకుతో డీలర్లు వంట నూనెల కుత్రిమ కొరత సృష్టిస్తూ ప్రజలపై అధిక భారాలు మోపుతున్నారని వెంటనే వంట నూనెల ధరలను అదుపులో ఉండేవిధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని లేనిపక్షంలో దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలిపారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టిసి టికెట్ ధరలను తగ్గించాలని, సంస్థ ప్రయివేటీకరణ దిశగా చేస్తున్న చర్యలను ఆపాలని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి అబ్బాస్ మాట్లాడుతూ ధరణి పోర్టుర్ లో మార్పులు తెచ్చి పేదలు అనుభవంలో ఉన్న పోడు , బంజరు, ఇనాం , అసైన్డ్ మెంట్ ,చెరువు శిఖం ,భూదాన, దేవాదాయ, కాందిశీకుల భూములకు పట్టాలివ్వాలని , రైతు బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఇర్రి అహల్య, రాపర్తి రాజు, రాపర్తి సోమన్న, గొల్లపల్లి బాపురెడ్డి, సాంబరాజు యాదగిరి, బిట్ల శేఖర్, బూడిది గోపి, పి. ఉపేందర్, ఎ. కుమార్, బోడ నరేందర్, బి. వెంకటేష్, ch. సోమన్న, ఎం.డి సభానా, ఎం.డి. అజారోద్దిన్, J.ప్రకాష్, ఎం. రమేష్, కె. యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.