హనుమకొండ:ఉద్యోగనోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రేపు (ఫిబ్రవరి 25న) హైదరాబాదులో టి ఎస్ పి ఎస్ సి ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి పిలుపునిచ్చారు.ఈరోజు హనుమకొండ కుమార్ పల్లి లో జరిగిన డివైఎఫ్ఐ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఒక లక్షా 91 వేల పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదని రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వం మాత్రం దాటివేస్తుంది అని ప్రకటనలు గుప్పిస్తూ చేతులు దులుపుకుంది, నిరుద్యోగ యువత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విస్మరిస్తోందని, ఎన్నికల సమయంలోనే ఉద్యోగాలు ఇస్తామని మోసం చేస్తుందని విమర్శించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో నాయకులు జెట్టి కుమర్,డి.రాజు,అనిల్, శ్రీకాంత్,వంశీ, అజయ్ కుమార్ పాల్గొన్నారు.
