విద్యార్థులకు చక్కటి విద్యా బోధన చేసిన గురువులు భవిష్యత్తు తరాలకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తారని యం ఇ ఓ కె గోపాల్ రావు అన్నారు శనివారం మండల ప్రాధమిక పాఠశాల లో జరిగిన బదిలీ పై వెళుతున్న అప్సర షా హనబి సన్మాన కార్యక్రమం లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో బదిలీలు సహజ మే అయిన విద్యా బోధన చేసిన విధానం తో పసి పిల్లల మనస్సులో చెరగని స్థానం సంపాదించటమే గురువుకు గొప్ప వరం మని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ యం రామ నర్సయ్య గ్రామ సర్పంచ్ మెట్టు అలివేల నారాయణ రెడ్డి యం పి టి సి పగడాల విద్యావతి వెంకట్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరాల తిర్మల్ రెడ్డి యస్ యం సి చైర్మన్ జి స్వరూప టి సంగీత కె సరిత లింగ రాజు నవీన్ రవిందర్ కొండల్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు