ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించాలని ధర్న

ఎండలో గంటపాటు ధర్నా నిర్వహించిన కూలీలు

*10 నుండి 11 గంటల వరకు ఆఫీసుకు రాని అధికారులు
కాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న ఎంపీడీవో కార్యాలయం

*ఎండలోపనిచేస్తున్న ఉపాధి కూలీలకు మంచినీళ్లు అన్న పొయ్యండి.

  • తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అలవాల వీరయ్య.

చిన్నగూడూరు ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళ
వారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య, సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు గునిగంటి మోహన్ మాట్లాడుతూ చిన్న గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో 10 గంటల నుండి 11 గంటల వరకు ధర్నా నిర్వహిస్తున్న అధికారులు ఎవరూ లేకపోవడం చాలా విచారకరం అన్నారు. కాళీ కుర్చీలతో కార్యాలయం దర్శనం ఇస్తుందని సమస్యలు ఉన్నా ప్రజలు, కూలీలు వారి సమస్యలు అన్ని చెప్పుకుందాం మని వస్తే ఒక్క అధికారి కూడా లేకపోవడం ఈ ప్రభుత్వా దివాలా కోరుతనానికి నిదర్శనమని అన్నారు.
గత ఆరు నెలలుగా కూలీలు పని చేసిన వారికి కనీసం ప్లే స్లిప్పులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఒక రోజుకు ఉపాధి కూలీలకు 270 ఇవ్వవలసి ఉండగా చిన్నగూడూరు మండలం లో 70 నుండి 130 రూపాయలు చెల్లిస్తున్నారని ఈ విషయమై లేబర్ కోర్టు ఆశ్రయిస్తామని వారు డిమాండ్ చేశారు.
కనీస వేతన చట్టం ద్వారా పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని ఉపాధి పని లో సంవత్సరానికి 200 రోజుల పనికి రోజుకు 600 కూలీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలునిర్వీర్యం చేస్తున్నాయని ప్రజలు చేతినిండా పని లేక అర్ధాకలితో కూలీలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని సర్కార్ అవలంబిస్తున్న దివాలాకోరు విధానాల వల్ల రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు పొట్టనిండా రెండు పూటల తిండిలేక పౌష్టికాహార లోపంతో అనారోగ్యానికి గురవుతున్నారని రోగాలు నొప్పులు, విష జ్వరాలు, ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎండకు కూలీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా టెంటుకూడా ఏర్పాటు చేయలేదని మంచినీళ్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున . టెంటు, మజ్జిగ, మంచి నీరు ఓవర్ ఎస్ ప్యాకెట్లు ఇవ్వడంతో పాటు వేసవి అలావెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం గంట తర్వాత వచ్చిన ఎంపీడీవో శ్యామ్ సుందర్ కి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందచేశారు. కార్యక్రమంలో ఉపాధి కూలీలు మల్లేష్, దేవేందర్, ముస్తఫా, వీరయ్య, వెంకమ్మ, ఉప్పలమ్మ, ఎల్లమ్మ, మంగమ్మ, సత్యమ్మ, పూలమ్మ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.