#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా ఉపాధ్యక్షులు గొల్లపల్లి నాగయ్య డిమాండ్
E69News:భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కార్ల్ మార్క్స్ కాలనీలోని శ్రామిక భవన్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా ఉపాధ్యక్షులు కామ్రేడ్ గొల్లపల్లి నాగయ్య గారు హాజరై ప్రసంగించారు.రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కూలీలు రైతులు కార్మిక విద్యార్థి యువజన మహిళ సామాజికవర్గాల వ్యతిరేక విధానాలు మానుకోవాలని పలికారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న సి ఐ టి యు, రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.జిల్లాలో వ్యవసాయ భూములకు పట్టాలు లేవు .ఇంటి స్థలాలు లేని దళిత గిరిజనులకు ఇప్పటివరకు ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదు. డబల్ బెడ్ రూమ్ లో పెన్షన్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ భూములు గుర్తించి సంఘం ఆధ్వర్యంలో ఎర్ర జెండా భూముల కోసం ఇంటి స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే జిల్లాలోని గ్రామంలో రైతుల పంటలు ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేసి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడం అన్యాయం. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని కబ్జాలకు గురవుతున్న జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కనీసం అన్ని గ్రామాల్లోని ఇళ్లకు ఇంటి పట్టాలు కూడా ఇవ్వలేదు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు. దళిత బంధు పేరుతో అధికార పార్టీ కార్యకర్తలకు ఇవ్వటం అన్యాయం. దళిత బందు దళితులు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి పని ప్రతి కుటుంబానికి సంవత్సరంలో 200 రోజులు కల్పించి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే జిల్లాలో ఉపాధి పనులు కల్పించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరారు. జాబ్ కార్డు లేని ప్రజలందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలని, ఉపాధి పని కాడ సౌకర్యాలను మెరుగు పరచాలని సంబంధిత పరికరాలు అందజేయాలని, మెట్లకు అదనంగా ఆరు రూపాయలు వాళ్లని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ,ఈ విస్తృత సమావేశానికి బొడ్డు కిషోర్, మానేటి బాబు అధ్యక్షత వహించగా నాగయ్య గారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సకినాల మల్లయ్య, ఆకుల రవి, మల్లేశం ,సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.