ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్‌ అభ్యర్థి షేక్‌ సాబ్జీ

ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్‌ అభ్యర్థి షేక్‌ సాబ్జీ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, పీఆర్టీయూ మద్దతుతో బరిలోకి దిగిన గంధం నారాయణరావుపై 1,537 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. షేక్‌ సాబ్జీకి 7,983 ఓట్లు పోలవగా.. నారాయణరావుకు 6,446 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపుతోనే సాబ్జీ విజయం ఖరారైంది. అయితే దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

గుంటూరు-కృష్ణాలో కల్పలత ముందంజ

మరోవైపు గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో కల్పలత ముందంజలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఆమె 1,058 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో పీడీఎఫ్‌ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావు ఉన్నారు. 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు రానందున రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కల్పలతకు 3,818 ఓట్లు, నాగేశ్వరరావుకు 2,760 ఓట్లు వచ్చాయి.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.