ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయ్యారం నందు మండలంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడమైనది ఈ సందర్భంగా గా ఏర్పాటుచేసిన సమావేశానికి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి విజయ కుమారి అధ్యక్షులు వహించగా మండలంలోని ఉపాధ్యాయులు అత్యధికంగా హాజరైనారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులు ఎంపీపీ మౌనిక గ్రామపంచాయతీ సర్పంచ్ దనసరి కోటమ్మ ఉప సర్పంచ్ కవిత గారు ఎంపీటీసీ కుమారి గారు మరియు పాధ్యాయనీలు మాట్లాడుతూ ఆడపిల్లలు చదువు ద్వారా అవనికి వెలుగుని ,భవిష్యత్ తరాలకు బంగారు బాటను చూపుతారని ఆడపిల్లల చదువు కోసం కృషి చేసిన భారత తొలి ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే బాటలో నేటితరం ఉపాధ్యాయునిలు ప్రయాణించాలని కోరినారు. స్త్రీ పురుష సమానత్వం కోసం అందరూ కృషి చేయాలని వక్తలు సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో బాలికొన్నత పాఠశాల కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థుల నృ త్యాలు అలరించాయి ఈ సమావేశంలో వివిధ సంఘాల బాధ్యులు అతిథులను శాలువాలతో సత్కరించారు ఈ మహిళా దినోత్సవానికి హాజరైన మహిళా ఉపాధ్యాయులకు కుంకుమ భరణిలు ఇచ్చి గౌరవించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సంఘ నాయకులు కృష్ణ మూర్తి గారు రు బిచ్యా నాయక్ గారు, sk మీరా గారు, రూప్లా నాయక్ గారు,జి.మోహన్ గారు,బి.రామారావు గారు,ch. రవీందర్,శ్రీనివాస రెడ్డి గారు,ఉప్పలయ్య గారు మహిళా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.