#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు శుభాకాంక్షలు తెలియ చేశారు. ఆ శివుడి కరుణాకటాక్ష వీక్షణాలు, ఆశీస్సులు సదా ప్రజలపై వర్షించాలనీ, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలోని ఆలయాలన్నీ సమగ్రాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు ఆధ్యాత్మిక చింతనాపరులై శాంతి, సౌభాగ్యాలతో ప్రశాంత జీవనం గడపాలని ఆ ముక్కంటిని వేడుకున్నారు. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆ సదాశివుడి దర్శనాలు , అభిషేకాలు, అర్చనల్లో పాల్గొనాలని కోరారు.
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని భక్తులు శివాలయాలను సందర్శించి పూజలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేసిందని అయన తెలిపారు. దీనికి తోడుగా శివాలయాల సందర్శనకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా రెగ్యులర్ గా నిర్వహించే బస్సు సౌకర్యలతో పాటుగా ప్రత్యక బస్సులను ఏర్పాట్లు చేయడం జరిగిందని అయన తెలిపారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.